Read more!

English | Telugu

నీ దారి నువ్వు చూసుకో అని ముకుందకి తేల్చిచెప్పిన మురారి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కృష్ణ ముకుంద మురారి. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్‌-164లో.. పొద్దున్నే వాకింగ్ కి వెళ్ళి‌న మురారి గురించి ముకుంద ఎదురుచూస్తుంటుంది. ఇంతలో మురారి వస్తాడు. అప్పుడే కృష్ణ ఒక హ్యండ్ టవల్, వాటర్ బాటిల్ తీసికొచ్చి మురారికి ఇస్తుంది. దాంతో మురారి తుడ్చుకొని సోఫాలో కూర్చుంటాడు. ఆ తర్వాత కాఫీ తీసుకొస్తానని చెప్పి కృష్ణ కిచెన్ లోకి వెళ్తుంది.‌ కాసేపటికి 'మురారి.. మురారి' అని ముకుంద ఎన్ని సార్లు పిలిచినా అతను పలకకుండా.. తన మొబైల్ చూసుకుంటాడు. దాంతో అలసిపోయిన ముకుంద కోపంతో తన గదిలోకి వెళ్ళిపోతుంది. 

ముకుంద తన గదిలోకి వెళ్లి తీక్షణంగా ఆలోచిస్తుంది. నేను నాన్నతో చెప్పాను కదా.. మరి నాన్న మాట్లాడితే మురారి ఇలా ఎందుకు ఉంటాడు. నన్నెందుకు అవైడ్ చేస్తాడని ముకుంద ఆలోచిస్తుంది. మరొకవైపు కృష్ణ తన గదిలో ఉండి వాళ్ళ సీనియర్ డాక్టర్ భాను సర్ కి బర్త్ డే విషెస్ చెప్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మురారి ఎవరికి విషెస్ చెప్తున్నావని అడుగుతాడు.

మా సీనియర్ డాక్టర్ భాను సర్ ది బర్త్ డే ఈ రోజు అని కృష్ణ చెప్పగానే.. మరి నీ బర్త్ డే ఎప్పుడని కృష్ణని మురారి అడుగుతాడు. దాంతో సెప్టెంబరు16 అని కృష్ణ అంటుంది. హో అవునా.. ఇంకా టైం ఉంది కదా అని మురారి అంటాడు. ఆ రోజుకి ఇంకో ప్రత్యేకత ఉందని కృష్ణ అంటుంది. ఏంటని కృష్ణ అడుగగా.. మన అగ్రిమెంట్ కి కూడా అదేరోజు చివరిరోజని కృష్ణ అంటుంది. ఆ తర్వాత మురారి నోటమాటరాక మౌనంగా ఉంటాడు. కాసేపు కృష్ణ మురారిలు ఒకరినొకరు చూసుకుంటూ ఎమోషనల్ అవుతారు. 

ఆ తర్వాత ముకుందని కార్ లో బయటకు తీసుకెళ్తాడు మురారి. ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావని ముకుంద అడుగుతుంది. దాంతో మా ఇద్దరిది అగ్రిమెంట్ మ్యారేజ్ అని మీ నాన్నతో ఎందుకు చెప్పావని మురారి అంటాడు. అది నిజమే కదా.‌ నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని ముకుంద అంటుంది. అవును అది నీకు అనవసరం‌‌.. కృష్ణ గురించి మాట్లాడే అర్హత మీ ఇద్దరికి లేదని మురారి అంటాడు. అగ్రిమెంట్ తర్వాత కృష్ణ వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత నువ్వు నా వాడివవుతావని ముకుంద అంటుంది. వేరొకరి భార్యని నేనెలా పెళ్ళి చేసుకుంటాను. ఒకవేళ ఆదర్శ్ వచ్చాక నీకు తనతో ఉండటం ఇష్టం లేకుంటే.. నేనే దగ్గరుండి డైవర్స్ ఇప్పిస్తాను.. ఆ తర్వాత మీ నాన్న నీకు మంచి సంబంధం తీసుకొస్తాడని మురారి అనగానే.. నువ్వు లేని లోకంలో నేనొక జీవచ్చవంలా బ్రతుకుతా అని ముకుంద అంటుంది. ఇక నీ లైఫ్ నీది.. నా లైఫ్ నాది అని మురారి చెప్తాడు. కాసేపటికి వెళదాం పదా అని కార్ లో‌ ముకుందని ఇంటికి తీసుకొస్తుంటాడు మురారి. అలా కార్ లో వస్తుండగా మురారి తనతో చెప్పిన మాటలన్నీ ముకుంద ఆలోచిస్తుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.