English | Telugu

నీ భార్యకు దూరంగా ఉండాలి.. అప్పటిలా నాతో ప్రేమగా ఉండాలి!

స్టార్ మాలో ప్రసారమవుతున్న 'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ ఎపిసోడ్-66 లోకి అడుగుపెట్టింది. కాగా శనివారం జరిగిన ఎపిసోడ్ లో... మురారి వస్తున్న విషయం తెలిసి అందంగా ముస్తాబై ఎదురుచూస్తూ ఉంటుంది ముకుంద.

మురారి వచ్చి డోర్ దగ్గర నిలబడగానే సంతోషపడి లోపలికి పిలుస్తుంది. "ముకుంద మనింటికి వెళ్దాం పదా" అని మురారి అడుగగా... "మన ఇల్లా? నాకు అక్కడ విలువ ఉందా? నువ్వు నీ భార్యతో సంతోషంగా ఉన్నావు" అని ముకుంద అంటుంది. దానికి మురారి "నీకు పెళ్లి అయింది... ఆదర్శ్ వస్తాడు. నువ్వు అక్కడే ఉండాలి" అని అంటాడు. "నువ్వు నా పాత మురారిలా నాతో ప్రేమగా ఉంటే వస్తాను. నాకు నువ్వు ఒక మాట ఇస్తే వస్తాను. నువ్వు కృష్ణకి దూరంగా ఉండాలి. ఎలాగు నువ్వు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నా అని అన్నావు... దానినే కంటిన్యూ చెయ్" అని ముకుంద చెప్తుంది. మురారి మౌనంగా ఉంటాడు. "ఏంటీ మౌనంగా ఉన్నావ్.. మౌనం అంగీకారం అనుకోవాలా? నీ ప్రేమ కోసం పరితపిస్తున్న నాకు నువ్వు కావాలి. నీ ప్రేమ నాకు వరంగా ఇవ్వు. నువ్వు నేను మన ప్రేమ అంతే" అని ముకుంద అంటుంది. "సరే వెళ్దాం" అని మురారి అంటాడు. కలిసి ప్రేమగా భోజనం చేద్దాం అని ముకుంద అనేసరికి ఇంతలో ముకుంద వాళ్ళ అమ్మనాన్నలు వస్తారు. ముకుందని కాఫీ తీసుకొని‌ రా అని చెప్పి.. "మీ ప్రేమ‌ విషయం నాకు తెలుసు.. ఆ ఇంటి పరువు, ఈ ఇంటి పరువు కాపాడాల్సిన భాద్యత నీపై ఉంది" అని మురారితో ముకుంద నాన్న చెప్తాడు.

మరో వైపు నందినితో ఆడుకుంటున్న కృష్ణని రేవతి కోప్పడుతుంది. నీ భర్త గురించి ఎదురు చూడాలి గాని ఇలా ఆటలు ఏంటీ? అని రేవతి విసుక్కుంటుంది. ముకుందని తీసుకొని మురారి వస్తుండగా... మధ్యలో ఐస్ క్రీం తిందామని అంటుంది ముకుంద. మరోవైపు ఎవరైనా చూస్తారేమోనని మురారి ఇబ్బంది పడతాడు. మురారితో ఐస్ క్రీం తింటూ సెల్ఫీ తీసుకుంటుంది ముకుంద. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.