English | Telugu

వాళ్ళిద్దరి మధ్య దూరం పెంచాలని చూస్తున్న ముకుంద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -150 లో.. కాఫీ షాప్ నుండి కృష్ణ, మురారిలు ఇంటికి బయల్దేరతారు. కృష్ణ, మురారి వైపు అలానే చూస్తూ ఉంటుంది. తనని చూసిన మురారి.. ఏంటి ఈ రోజు అలా చూస్తున్నావ్? కారణమేంటో చెప్పమని కృష్ణని అడుగుతాడు. అదేం లేదు ఏసీపీ సర్.. మీ అమ్మ గారు ఏం చెప్పారు.. నీ భర్తని దగ్గరుండి చూసుకోమని.. అందుకే ఇలా చూస్తున్నాని కృష్ణ అంటుంది. ఇక మధ్యలో కార్ ఆపి.. ఇద్దరు పుల్ల ఐస్ తింటారు. ఆ తర్వాత క్రికెట్ ఆడుతున్న పిల్లల దగ్గరికి వెళ్ళి.. కృష్ణ క్రికెట్ ఆడుతూ సంతోషపడుతుంది. సర్ నేను వీళ్ళ కంటే ఊరమాస్ అని మురారితో చెప్తుంది.

మరొకవైపు కృష్ణ, మురారిల గురించి ఆలోచిస్తుంటుంది ముకుంద. నేను చదువుకున్న దాన్ని మురారితో ప్రేమ వల్ల నా స్థాయి నేను దిగదార్చుకుంటున్నాను.. ఇక ఇప్పటి నుండి నా విలువ పోకుండా మురారి ప్రేమ దక్కించుకోవాలి.. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ లేదు.. కలిసిపోయే ఛాన్స్ లేదు.. నాకు, మురారి మధ్య ప్రేమ ఉంది.. కలిసిపోయే ఛాన్స్ ఉంది.. ఎలాగైనా మురారి, కృష్ణ మధ్య ఇంకా దూరం పెంచాలని ముకుంద ఆలోచిస్తుంటుంది. ఆ తర్వాత కాసేపటికి కృష్ణ, మురారిలు ఇంటికి రాగానే.. నేను లోపలికి రానని కృష్ణ.. సరదాగా కార్ పై ఎక్కి కూర్చుని, మురారిని ఆటపట్టిస్తుంది. నేను లోపలికి రావాలంటే నన్ను ఎత్తుకొని తీసుకొని వెళ్ళండని కృష్ణ అనగానే.. మురారి మురిసిపోతూ.. నిజామా అని కృష్ణని ప్రేమతో ఎత్తుకొని తీసుకెళ్ళి ఇంటో దింపుతాడు. అదంతా పై నుంచి చూస్తున్న ముకుంద తట్టుకోలేక పోతుంది. రేవతి మాత్రం వాళ్ళు అలా సంతోషంగా ఉండడం చూసి.. తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. కృష్ణ పడిపోతుంటే.. మురారి పట్టుకుంటాడు.. చూసుకొని నడువు జాగ్రత్త అని మురారి అనగానే.. నువ్వు ఉన్నావ్ కదా పట్టుకోవడానికి అని కృష్ణ అంటుంది. నేను లేనప్పుడు పడిపోతే దెబ్బ తగులుతుంది కదా అని మురారి అంటాడు. ఆ తర్వాత ఇద్దరు లోపలికి వెళ్తారు. రేవతి దగ్గరికి కృష్ణ వెళ్ళి.. మీరు అద్భుతమైన కొడుకుని కన్నారు అత్తయ్య అంటూ సంతోషపడుతుంది. ఆ తర్వాత కృష్ణ, మురారి విషయంలో తను చేసిన తప్పు గురించి ఆలోచిస్తు.. ఇన్ని రోజులు ఏసీపీ సర్ పట్ల ఒక దిగులు ఉండేది. ఈ రోజుతో అంతా పోయిందని అనుకుంటూ.. తన నాన్న ఫోటో దగ్గర నిల్చొని ఎమోషనల్ అవుతుంది కృష్ణ.. అంత స్వచ్ఛమైన మనిషికి సారీ చెప్పి తుడుచుకోలేను.. నా సేవలతో ఆ తప్పుని తుడిచివేస్తానని కృష్ణ అనుకుంటుంది.

ఆ తర్వాత మురారి దగ్గరకి కృష్ణ వస్తుంది. ఏంటి కృష్ణ ఈ రోజు కొత్తగా ప్రవర్తిస్తున్నావని మురారి అంటాడు. ఈ రోజు నుండి మీ పనులన్నీ నేనే చేస్తాను.. మీకు ఇబ్బంది కలిగించనని కృష్ణ అనగానే.. ఏంటి ఇదంతా కృతజ్ఞతేనా అని మురారి అంటాడు. కృతజ్ఞత కన్నా పెద్దది, గొప్పది అంటుంది కృష్ణ. మీకు వంట చేస్తానని చెప్పి కృష్ణ వెళ్తుంది. ఈ రోజు కృష్ణ నాకు దగ్గరగా వచ్చినట్లు అనిపించింది.. నా మీద ప్రేమ ఉందని తప్ప.. అన్నీ చెప్తుందని మురారి అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాత ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi Serial : దుగ్గిరాల కుటుంబం హ్యాపీ.. రుద్రాణి కన్నింగ్ ప్లాన్ అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి (Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-931 లో.. మినిస్టర్ కి పాప పుడుతుంది. ఆపరేషన్ తర్వత డాక్టర్ బయటకు వస్తాడు. మీకు పాప పుట్టింది అని డాక్టర్ అనగానే.. మినిస్టర్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. కానీ పాపకి ఒక ప్రాబ్లమ్ ఉందని డాక్టర్ చెప్తాడు. ఏ ప్రాబ్లమ్ ఉన్నా ఆపరేషన్ చేయించండి.. ఎంతమంది డాక్టర్ లు ఐనా , ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి అయినా ఆపరేషన్ చేపించండి అని మినిస్టర్ అనగానే.. ఇప్పుడు చేయకూడదు.. పాప వెయిట్ తక్కువ ఉంది.. పాప పెరిగాక ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్తాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేదంతా రుద్రాణి చూస్తుంది.

Illu illalu pillalu Serial:  అమూల్య ఎంగేజ్ మెంట్ ఆపడానికి భద్రవతి ప్లాన్.. భాగ్యం ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు (Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-370 లో.. దేవుడా ఏ ఆటంకం లేకుండా ఈ నిశ్చితార్థం సవ్యంగా జరిగేలా చూడు అని దేవుడికి మొక్కుకుంటుంది వేదవతి. అప్పుడే దేవుడి దగ్గరున్న దీపాలు ఆరిపోతాయి. అయ్యో ఇదేంటి దీపాలు ఆరిపోయాయేంటని వేదవతి టెన్షన్ పడుతుంది. మరోవైపు కామాక్షి భర్త కోసం గుమ్మం దగ్గర ఎదురుచూస్తుంటుంది. అప్పుడే తిరుపతి చూస్తాడు. ఏంటమ్మా అని అడుగుతాడు. మా ఆయన కోసం ఎదురుచూస్తున్నానని కామాక్షి చెప్తుంది. అప్పుడే కామాక్షి భర్త ఆటోలో ఎంట్రీ ఇస్తాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.