English | Telugu

ఇది కామెడీ షో కాదు.. అశ్వత్థామ 2.0 అని అనొద్దు!

బిగ్ బాస్ సీజన్-8 ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకుంది.‌ ఇక ఇప్పుడు ఏడో వారం నామినేషన్లు నేటితో మొదలవ్వనున్నాయి.‌ ఇక తాజాగా వచ్చిన ఈ ప్రోమో ఇప్పుడు ఆకట్టుకుంటుంది.

ఎవరు నామినేట్ అవుతారనేది ప్రేరణ, హరితేజ మీద ఆధారపడి ఉంటుంది. ఇద్దరు కిల్లర్ గర్ల్స్ పరుగెత్తుకుంటూ వెళ్ళి హ్యాట్ ని పట్టుకోవాలి. ఎవరైతే వెళ్లి పట్టుకుంటారో వారికి నామినేట్ చేసే , నామినేషన్ నుండి డ్రాప్ చేసే అవకాశం లభిస్తోందనే కండిషన్ పెట్టాడు బిగ్ బాస్. రోహిణి తన నామినేషన్ గా గౌతమ్ ని చేసింది. చక్కగా ఒక ప్లోలో వెళ్తున్న ఫన్ టాస్క్ లో గౌతమ్ అలా హర్ట్ చేయడం నాకు నచ్చలేదనే పాయింట్ ని రోహిణి చెప్తూ నామినేట్ చేసింది. ఇక గౌతమ్ రెచ్చిపోయాడు. కామెడీ అయిన ఏదైనా అది బుల్లీయింగ్ కిందకు వస్తుందని గౌతమ్ అనగా.. బుల్లీయింగ్ అనేది చాలా స్ట్రాంగ్ వర్డ్ గౌతమ్... వాడు చేయాలా వద్దా అనేది బిగ్ బాస్ అడిగే చేశాడంటూ నిఖిల్ అన్నాడు. బుల్లీయింగ్ అంటే ఒక మనిషికి నచ్చని విషయాన్ని మళ్ళీ మళ్ళీ గుచ్చి గుచ్చి చెప్పడం అంటు గౌతమ్ అనగానే.. అది మాకు తెలియదంటూ అవినాష్.. నేను నిన్ను అశ్వత్థామ 2.0 అని అనను అంటు రిక్వెస్ట్ చేస్తూ తన డిఫెండింగ్ ని చెప్పుకున్నాడు.

ఇక మధ్యలో ఇది కామెడీ షో కాదు.. బిగ్ బాస్ షో అంటు అవినాష్ ని కించపరిచేలా గౌతమ్ మాట్లాడటంతో అతను హర్ట్ అయిపోయి చొక్కా తీసేశాడు.‌ ఇక రోహిణి కూడా తన వంతుగా మాట్లాడింది. కామెడీ షో చేసేవారికి ఎమోషన్స్ ఉండవా అంటు రోహిణి మాట్లాడింది. వీకెండ్ లో నాగార్జున సర్ కూడా ఇదే పాయింట్ చెప్పాడు కదా అంటు నిఖిల్ తో అవినాష్ చెప్పుకోగా.. టేస్టీ తేజతో గౌతమ్ చెప్పుకున్నాడు. ఈ ప్రోమోని ఇప్పుడు నామినేషన్స్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి వీళ్ళిద్దరి మధ్య ఈ గొడవ అలానే వారమంతా కొనసాగుతుందా.. అసలు నామినేషన్లో ఎంతమంది ఉన్నారు.. ఎవరు లేరో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.