English | Telugu

మొగ్గలో జోకులు.. ఏం షోరా బాబూ ఇది!

ఇటీవలి కాలంలో బుల్లితెర పై అడల్ట్ కంటెంట్ అనేది ఎక్కువైపోయింది. ఏ షో చూసినా పొట్టి బట్టలు లేదా ఎక్స్పోజింగ్ లేదా డబుల్ మీనింగ్ డైలాగ్స్. ఇలా సాగుతున్నాయి షోస్. ఆ కోవలోకి వస్తుంది 'జాతిరత్నాలు' షో. ఇందులో స్టాండప్ కామెడీ కూడా కొంచెం హద్దులు దాటుతూ ఉంటుంది ఒక్కోసారి. కొందరైతే సోషల్ మీడియాలో వాడే కొన్ని పదాలు మరీ హద్దూ పద్దూ లేకుండా వాడేస్తున్నారు.

ఇక లేటెస్ట్ గా రిలీజ్ ఐన ప్రోమోలో ఎక్కువగా కుళ్ళు జోకులే వినిపిస్తున్నాయి. 'మొగ్గలో జోక్స్' పేరుతో ఒక కమెడియన్ నానా హంగామా చేసేసాడు. అందరూ విరగబడి నవ్వేసుకున్నారు. స్కూల్, స్టూడెంట్, టీచర్ పేరుతో ఒక కామెడీ చేశారు. "ఎవర్రా ఇక్కడ వరస్ట్ ఫెలో మొగ్గలో జోకులు వేస్తోంది" అని టీచర్ అడిగారు. దీంతో శ్రీముఖి, పంచ్ ప్రసాద్ విరగపడి నవ్వారు. "ఐ లవ్ దట్ మొగ్గ" అని ఆ స్టూడెంట్ అన్నాడు. ఈ మొగ్గ పేరుతో కామెడీ చేస్తుంటే అక్కడ ఫన్ క్రియేట్ అవుతుంది. ఇల్లాంటి అడల్డ్ కామెడీ కంటెంట్‌ను అక్కడి వాళ్లంతా బాగానే ఎంజాయ్ చేస్తున్నారు.

ఏదేమైనా 'హెల్తీ కంటెంట్ ఉంటే ఎక్కువ పేరు వస్తుంది. అదే ఇలాంటి పిచ్చి కామెడీ ఉంటే గనక ఎక్కువ రోజులు ఇలాంటి షోస్ నడవవు' అని మేకర్స్ తెలుసుకోవాలి.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.