English | Telugu
శ్రీసత్యకు ప్రొపోజ్ చేసిన మెహబూబ్..నా లైఫ్ లో ప్రేమ, పెళ్లి అనేవే లేవు!
Updated : Feb 15, 2023
ఇటీవలి కాలంలో ప్రాంక్ వీడియోస్ ట్రెండ్ బీభత్సంగా నడుస్తోంది. ఏ చిన్న టాపిక్ మైండ్ లోకి వచ్చినా సరే అది ప్రాంక్ వీడియోగా తీసేసి యూట్యూబ్ లో పెట్టేసి ఫుల్ డబ్బులు సంపాదించేస్తున్నారు.
ఇప్పుడు మెహబూబ్ కూడా అదే పని చేసాడు. బిగ్ బాస్ సీజన్ 6 పూర్తయ్యాక ఆడియన్స్ ని ఎటూ డైవర్ట్ కానివ్వకుండా బీబీ జోడి పేరుతో డాన్స్ షో ప్లాన్ చేసి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో ఒక షో చేస్తున్నారు మేకర్స్. ఇందులో మెహబూబ్ - శ్రీసత్య ఒక జోడి. వీళ్ళ డాన్స్ పెర్ఫార్మెన్స్ సూపర్ గా ఉంటుంది కూడా. వీళ్ళ డాన్స్ చూస్తే ఇద్దరి మధ్యన ఏదో ఉంది అన్న ఆలోచన రాకుండా ఉండదు. ఇదే అదనుగా వాలెంటైన్స్ డే రోజున మెహబూబ్ శ్రీసత్యకు రోజెస్ ఇచ్చేసి ప్రొపోజ్ చేసేసాడు. అల్రెడీ బిగ్ బాస్ హౌస్ లో పెంటయ్యింది. ఇప్పుడు కూడా అవ్వుద్ది అని సత్య మెహబూబ్ మీద ఫుల్ సీరియస్ ఐపోయింది. మెహబూబ్ లవ్ ని యాక్సెప్ట్ చేయకపోయేసరికి చేయి కోసుకోవడానికి ట్రై చేసాడు మెహబూబ్. దానికి అక్కడే ఉన్న కొరియోగ్రాఫర్లు సంకేత్, ప్రియాంక, సత్య కంగారు పడ్డారు. జీవితంలో ఎవ్వరినీ ప్రేమించకూడదని డిసైడ్ అయ్యాను. నా పాస్ట్ లైఫ్ అలాంటిది. ఎవరూ కూడా అలాంటి లైఫ్ ఉండాలని కోరుకోరు అని చెప్పింది సత్య.
అందుకే నా లైఫ్ లోకి ఇంకెవరినీ రానివ్వను, పెళ్లి కూడా చేసుకోను అని ఖరాఖండిగా చెప్పేసింది. సిట్యువేషన్ సీరియస్ నెస్ ని డిమాండ్ చేస్తోంది అనుకున్న మెహబూబ్ అసలు విషయాన్ని రివీల్ చేసి శ్రీసత్యకు ట్విస్ట్ ఇచ్చాడు. ఇదంతా ప్రాంక్ వీడియో అని తెలిసేసరికి బుంగ మూతి పెట్టేసింది సత్య. "మెహబూబ్ నీకు ఇటువంటి ఐడియాలు ఎలా వస్తాయయ్యా "అంటూ మండిపడింది. ఇప్పుడు ఈ లవ్ ప్రొపోజల్ ప్రాంక్ వీడియో సోషల్ మీడియాలో మంచి వ్యూస్ ని సంపాదించుకుంటోంది.