English | Telugu

అల్టిమేట్ డ్యాన్స్ తో ఆకట్టుకుంటోన్న బీబీ జోడి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న 'బీబీ జోడి' ఆసక్తికరంగా సాగుతోంది. ఒక్కో జోడి ఒక్కో లెవల్ పర్ఫామెన్స్ ఇస్తూ అల్టిమేట్ డ్యాన్స్ ని చేస్తున్నారు. కాగా ఈ బీబీ జోడిల డ్యాన్స్ విమర్శకుల ప్రశంసలు పొందుతోంది.

రవికృష్ణ-భాను జోడి మొదట డ్యాన్స్ పర్ఫామెన్స్ చేసారు. పొగలు వచ్చేలాగా చేశారని శ్రీముఖి చెప్పగా... సదా గూస్ బంప్స్ వచ్చాయని చెప్పింది. పర్ఫెక్ట్ మూమెంట్స్ అని రాధ చెప్పింది. "స్పానిష్ డ్యాన్స్ ఎలా చేస్తారో అనుకున్నా కానీ యూ గాయ్స్ ఆర్ డామినేటింగ్ ద స్టేజ్" అని తరుణ్ మాస్టర్ చెప్పాడు. ఆ తర్వాత అవినాష్-అరియానా జోడి కలిసి శివుడు, గంగలుగా కలసి చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంది. "గెటప్ ని డామినేట్ చేసావ్ అవినాష్. గంగ లాగా అరియానా... యూ డిసర్వింగ్" అని తరుణ్ మాస్టర్ చెప్పాడు. "అమేజింగ్ కొరియోగ్రఫీ, మీరు శివుడిలాగా రౌద్రం చూపించిన తీరు అద్భుతం" అని సదా చెప్పుకొచ్చింది. అర్జున్- వసంతి జోడి చేసిన డ్యాన్స్ కి 'ఓ మై గాడ్' అని అరిచింది రాధ. 'బీబీ జోడియా మజాకా' అని తరుణ్ మాస్టర్ చెప్పాడు. "కెమెస్ట్రీ బాగుంది. అర్జున్ వెల్ డన్.. ఇప్పుడు లిప్ బాగా ఇచ్చారు. ఎక్స్‌ప్రెసెషన్ కూడా ఎలివేట్ అయ్యింది. లవ్లీ పర్ఫామెన్స్. యూ పుట్ ఇన్ ఆల్... ఎవ్రీతింగ్ ఫైన్" అని సదా చెప్పింది.

శ్రీసత్య-మెహబూబ్ జోడి కలిసి సాల్సా డ్యాన్స్ చేసారు.‌ ఇది చూసి జడ్జ్ లు షాక్ అయ్యారు. మైండ్ బ్లోయింగ్ పర్ఫామెన్స్ ఇచ్చి బెస్ట్ పర్ఫామర్స్ గా నిలిచారు. జడ్జ్ లు అన్ని‌ జోడిలకు ఫుల్‌ మార్క్స్ ఇచ్చారు. ఈ వారం జరిగిన అన్ని జోడీల పర్ఫామెన్స్ అల్టిమేట్ డ్యాన్స్ గా నిలిచింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.