English | Telugu

కిక్కిచ్చే మిరపకాయ్ ఎంట్రీ..మెరిసిపోనున్న గ్రాండ్ ఫినాలే స్టేజ్!

ఢీ-14 డాన్సింగ్ ఐకాన్ ఇక ఫైనల్ కి చేరుకుంది. ఇప్పటివరకు డాన్స్ పెర్ఫామెన్సెస్ తో పాటు స్కిట్స్ కూడా ఆడియన్స్ ని ఎంతో అలరించాయి.

ఇక ఇప్పుడు ఎలిమినేషన్స్ రౌండ్స్ పూర్తైపోయి. గ్రాండ్ ఫినాలేలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇక గ్రాండ్ ఫినాలేకి కిక్కిచ్చే హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. "కంటెంట్ తప్ప కాంట్రవర్సీ లేని హీరో, పవర్ తప్ప పొగరు లేని హీరో, ఇదిగో అబ్బాయి... వస్తున్నాడు మన మిరపకాయ్" ..అని ప్రదీప్ మంచి జోష్ తో అనౌన్స్ చేసేసరికి మాస్ మహారాజ రవితేజ ఉరుములు, మెరుపులతో అలా నడుచుకుంటూ వచ్చి అందరినీ మెస్మరైజ్ చేసేసాడు.

ఇక ఢీ-14 డాన్సింగ్ ఐకాన్ సెట్ లో రవితేజని చూసేసరికి అందరూ లేచి వీలలు, కేకలు వేశారు. ఇక ఆ సౌండ్ తట్టుకోలేక "ఒరేయ్ ఆగండ్రా" అనే మాస్ డైలాగ్ చెప్పి అందరినీ నవ్వించాడు మాస్ మహారాజ. రవితేజ ఎంట్రీ ఇచ్చిన ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ డిసెంబర్ 4 వ తేదీ ఆదివారం రాత్రి 7 గంటలకు ప్రసారం కాబోతోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.