English | Telugu
టాయిలెట్ కి అని చెప్పి వెళ్తూ ఆ పని చేసేవాడిని...నువ్వు దేన్నైనా ఫినిష్ చేసేస్తావ్
Updated : Jun 26, 2023
"సుమ అడ్డా షో" ప్రతీ వారంలాగే ఈ వారం కూడా ఫుల్ ఎంటర్టైన్ చేసింది. ఇందులో ఈ వారం మహేష్ విట్టా- హరితేజ, అష్షు రెడ్డి-మహేష్ ఆచంట వచ్చారు. ఫస్ట్ రౌండ్ లో "పరీక్షలు అనగానే ఏమి గుర్తొస్తుంది" అని అడిగేసరికి "నేను అందరూ నిద్రపోయాక 11 గంటల నుంచి చదువుకోవడం మొదలు పెట్టేదాన్ని. అలా పరీక్ష టైం వరకు చదువుకుని ఆ తర్వాత ముఖం కడుక్కుని ఎగ్జామ్ కి వెళ్లిపోయేదాన్ని" అని హరితేజ అనేసరికి.."ఎగ్జామ్ హాల్ కి వెళ్లి అక్కడ నిద్రపోయేది" అంటూ కౌంటర్ వేసాడు మహేష్ ఆచంట. "మీరేం చేసేవారు" అంటూ సుమ మహేష్ విట్టాని అడిగేసరికి " నేను రాత్రంతా బాగా నిద్రపోయేవాడిని ఎగ్జామ్ లో ఎదో ఒకటి రాసేవాడిని..దేనికైనా ఆన్సర్ తెలీనప్పుడు టాయిలెట్ అని చెప్పి అందరి ఆన్సర్ షీట్స్ చూసుకుంటూ వెళ్ళేవాడిని" అని చెప్పాడు.
"రిజల్ట్ వచ్చినప్పుడు ఎలా ఉండేది ఇంట్లో పరిస్థితి" అని అడిగేసరికి "ఇంటికి రానని చెప్పేదాన్ని" అని హరితేజ అనేసరికి "అంత బాగా చదివావు కదా.. ఎందుకు మరి భయం" అని సుమ అడిగేసరికి "అది చదవడం కాదు యాక్ట్ చేయడం" అని అసలు నిజం చెప్పేసింది హరితేజ. "మరి నీ పరిస్థితి ఏమిటి అని మహేష్ ఆచంటని అడిగింది సుమ. నేను అన్నిట్లో పాస్ అయ్యాను. ఎంబిఏలో ఒక సబ్జెక్టు ఆగింది. అని చెప్పాడు. అంటే నువ్వు ఎంబిఏ వరకు వెళ్ళావు చూసావా అది చాల గ్రేట్ అంది సుమ. "ఎంబిఏ వరకు వెళ్ళాడు కానీ నేను ఎంబిఏ ఫినిష్ చేశా" అని మధ్యలో వచ్చిన అష్షు చెప్పేసరికి "నువ్వు దేన్నైనా ఫినిష్ చేసేస్తావు" అని కౌటర్ వేసింది సుమ. ఈ నలుగురు కూడా బుల్లితెర మీద వెండితెర మీద రాణిస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో తమ తమ అప్ డేట్స్ ని షేర్ చేసుకుంటూ ఉంటారు.