English | Telugu

సీజన్-7 గ్రాంఢ్ ఫినాలేకి మహేష్ బాబు!

బిగ్ బాస్ ఇప్పటికే పద్నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. మరో రెండు రోజుల్లో బిగ్ బాస్ గ్రాంఢ్ ఫినాలే ఉండబోతుంది‌. అయితే నిన్నటి వరకు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని ఓటింగ్ లో లీస్ట్ లో ఉన్న అంబటి అర్జున్ ఎలిమినేషన్ అయ్యాడని కొన్ని వార్తలు రాగా అవన్నీ ఫేక్ అని తెలిసింది. కాగా ఇప్పుడు మరో న్యూస్ వైరల్ గా మారుతుంది.

ఇప్పటివరకు బిగ్ బాస్ గ్రాంఢ్ ఫినాలేకి ఎంతో మంది సెలబ్రిటీలు వచ్చారు. అయితే ఈ సీజన్-7 కి సూపర్ స్టార్ మహేష్ బాబు వస్తున్నట్లు గట్టిగా వినిపిస్తుంది. అయితే ఇప్పటికే హౌస్ లోకి గెస్ట్ గా శ్రీముఖి వస్తున్నట్టు తెలుస్తోంది. ఇక నాగార్జున తన ' నా సామిరంగ' సినిమా ఫస్ట్ టీజర్ ని లాంఛ్ చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. ఇక యాంకర్ సుమ కనకాల ఫినాలే రోజున ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తుంది. అయితే విక్టరీ వెంకటేశ్ కూడా బిగ్ బాస్ స్టేజ్ మీద కనపించనున్నారని తెలుస్తోంది. అయితే ఇలాంటి చాలా ఆసక్తికరమైన విషయాలతో బిగ్ బాస్ సీజన్-7 గ్రాంఢ్ లాంచ్ పై ప్రేక్షకులకు భారీగానే అంచనాలు పెరిగాయి. కొన్ని ఇన్ స్టాగ్రామ్, సోషల్ మీడియా పేజీలలో అంబటి అర్జున్ హౌస్ లో లేడని, బయటకొచ్చాడని చెప్తున్నారు. నిన్నటి ఎపిసోడ్ లో ఇచ్చిన ర్యాంకింగ్ లో కూడా శివాజీకే మొదటి స్థానం ఇచ్చారు హౌస్ మేట్స్.

అయితే హౌస్ లో ప్రస్తుతం పల్లవి ప్రశాంత్, శివాజీ, యావర్, ప్రియాంక, అమర్ దీప్, అంబటి అర్జున్ ఉన్నారు. వీరిలో ఎవరు టైటిల్ విన్నర్ అవుతారనేది శుక్రవారం రాత్రివరకు పడే ఓటింగ్ తో తెలియనుంది‌. ఇక శనివారం రాత్రివరకు హౌస్ లో ఎంతమంది ఉంటారని తెలుస్తుంది. ఆయితే గ్రాంఢ్ ఫినాలే రోజున టైటిల్ కప్ ని అందించడానికి సూపర్ స్టార్ మహేష్ బాబు వస్తున్నాడని వస్తున్న వార్తలు నిజమే అయితే ఈ సీజన్ గ్రాంఢ్ గా ముగిసినట్టే. అయితే ప్రస్తుతం హౌస్ లో ఉన్నవారిలో ఓటింగ్ ప్రకారం టాప్-2 లో పల్లవి ప్రశాంత్, శివాజీ ఉండగా.. బాటమ్-2 లో ప్రియాంక, అర్జున్ ఇద్దరు ఉన్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.