English | Telugu

గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం మనీ డొనేట్ చేసిన బ్రహ్మముడి మానస్


రాబోయే ఆదివారం మదర్స్ డే సందర్భంగా స్టార్ మా ఛానెల్ మదర్స్ డే స్పెషల్ ప్రోగ్రాంని ప్లాన్ చేసింది. అమ్మ ప్రేమలో కమ్మదనాన్ని చూపించడానికి ఈ ఎపిసోడ్ ని డిజైన్ చేసింది స్టార్ మా. బుల్లితెర సెలబ్రిటీలు తమ తల్లుల గురించి చెప్పడంతో పాటు వాళ్లకు ఎన్నో గిఫ్ట్స్ కూడా ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. రౌడీ రోహిణి తన తల్లిని తీసుకొచ్చింది..రోహిణితో సమానంగా వాళ్ళ అమ్మ కూడా పంచులు పేల్చింది. అలాగే తల్లికి ఒక ఇంటిని కొని గిఫ్ట్ గా ఇచ్చింది. ఇక బ్రహ్మముడి శ్రీకర్ తన తల్లి కోసం గజ్జెలు తెచ్చి గిఫ్ట్ చేసాడు. ఆమె ఎపుడో వదిలేసినా క్లాసికల్ డాన్స్ చేసి అందరినీ అలరించింది. ఇక కార్తీక దీపం 2 లో నటిస్తున్న చిన్నారి చైత్ర "ఎవరు రాయగలరు" అనే సాంగ్ పాడి అందరినీ కంటతడి పెట్టించింది. ఇక భానుశ్రీ గురించి చెప్పాక్కర్లేదు. వాయిస్ అబ్బాయిలా ఉంటుందని చాలా కామెంట్స్ ని ట్రోల్స్ ని కూడా ఎదుర్కొంది. అలాంటి భానుశ్రీ వాళ్ళ అమ్మను స్టేజి మీదకు తీసుకొచ్చింది.

ఎవరైతే తనను గురించి ఒకప్పుడు నెగటివ్ గా మారారో ఇప్పుడు వాళ్ళే భానుశ్రీ గురించి పాజిటివ్ గా మాట్లాడుతున్నారని చాల గర్వంగా చెప్పింది. తర్వాత మానస్ వాళ్ళ అమ్మ కూడా స్టేజి మీదకు వచ్చింది "ఎన్ని జన్మలెత్తినా అమ్మగానే ఉండాలి..అప్పుడు కూడా మానస్ లాంటి అబ్బాయే కావాలి" అని చెప్పింది. తర్వాత షకీలా లైఫ్ హిస్టరీని స్కిట్ రూపంలో చేసి చూపించారు. చివరిలో మానస్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం కొంత అమౌంట్ ని డొనేట్ చేసాడు. ఇలా ఈ ఎపిసోడ్ ఆదివారం ప్రసారం కాబోతోంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.