English | Telugu

Little hearts : లిటిల్ హార్ట్స్ ఇండిపెండెంట్ ఫిల్మ్.. యూట్యూబ్  లో ఫుల్ ట్రెండింగ్!

యూట్యూబ్ లో రెగ్యులర్ గా ఫ్రెష్ కంటెంట్ ఉన్న షార్ట్ ఫిల్మ్స్ వస్తూనే ఉంటాయి. అయితే వాటిల్లో ఈ మధ్యకాలంలో మావిడాకులు, పెళ్ళివారమండి లాంటి వెబ్ సిరీస్ లతో ప్రసాద్ బెహరా ఫేమస్ అయ్యాడు. అయితే అతనితో పాటు కొంతమంది కొత్త యాక్టర్స్ ఫేమస్ అవుతున్నారు.

కన్నా, నవ్య నాయుడు చిట్యాల లాంటి వారు తమ వెబ్ సిరీస్ లతో ఫేమస్ అయ్యారు. అయితే వీరిద్దరు కలిసి 'లిటిల్ హార్ట్స్' అనే ఇండిపెండెంట్ తెలుగు షార్ట్ ఫిల్మ్ ని చేశారు. ఇది తాజాగా యూట్యూబ్ లో రిలీజ్ అయింది. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే లక్ష యాభై వేల వ్యూస్ ని చేరుకుంది. ఈ షార్ట్ ఫిల్మ్ కి ఇంత క్రేజ్ ఎందుకు అంటే కథ బాగుండటమే.. అను, సాగర్ అనే ఇద్దరు నాలుగు సంవత్సరాల నుండి రిలేషన్ లో ఉంటారు. అయితే ఒకరోజు ఇద్దరు ఛాటింగ్ లో‌ అను ఏం మెసెజ్ చేసిన అన్నింటికి వన్ వర్డ్ అన్సర్ ఇస్తుంటాడు సాగర్. దాంతో తను నెట్ ఆఫ్ చేస్తుంది.‌ఇక సాగర్ కాల్ చేసి కలుద్దామని అంటాడు. ఏమైందని సాగర్ అడుగగా.. అసలు నన్ను పట్టించుకోవడం లేదని అను అంటుంది. నాది నీలా సాఫ్ట్‌వేర్ జాబ్ కాదు కదా, ఆరు గంటలకే లాగవుట్ చేసి‌ బయటకు రావడానికి అని సాగర్ అనగానే.. ఎప్పుడు చూసిన పని, పని అని కోపంలో కార్ అద్దాన్ని కొట్టగా చేతికు గాయమతుంది. దాంతో హాస్పిటల్ కి తీసుకెళ్ళి వైద్యం చేస్తాడు డాక్టర్ సాగర్. ఇక అక్కడ నర్స్ గా సరోజమ్మ చేస్తుంటుంది.

ఇక అను(నవ్య నాయుడు చిట్యాల), డాక్టర్ సాగర్(కావ్య) ల ప్రేమ విషయం తెలుసుకుంటుంది సరోజమ్మ. మేమిద్దరం విడిపోతున్నామని అను అనగానే.. తనకెప్పుడు పనే నన్ను పట్టించుకునే టైమ్ లేదని అను అంటుంది. దాంతో సరోజమ్మ .. అవునులే అమ్మా.. సర్ తో ఏ అమ్మాయి ఎక్కువ కాలం ఉండదు. ఎందుకంటే తనకి ఎప్పుడు పనే..‌ ఆపదలో ఉన్నా, యాక్సిడెంట్ అయిన వారి ప్రాణాలు కాపాడాలనే చూస్తాడని సరోజమ్మ అంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే యూట్యూబ్ లోని ఈ షార్ట్ ఫిల్మ్ చూడాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.