English | Telugu

పెంచురా పెంచు.. ఆషు రెడ్డి సీక్రెట్ లీక్!

యాంకర్ రవి.. ఆషు రెడ్డి గురించి, ఆమె చేసే అడల్ట్ కామెంట్స్ గురించి చెప్పి రీతూని, ఆడియన్స్ ని బాగా నవ్వించాడు. దావత్ ప్రోగ్రాంలో రీతూ చౌదరి రవికి ఒక టాస్క్ ఇచ్చింది. మ్యాచింగ్ చేయాలంటూ కొన్ని ఇమేజెస్ ఇచ్చింది. అందులో ఆషు చిత్రానికి నోటి దూల చాలా ఎక్కువ అంటూ మ్యాచింగ్ చేసి చూపించాడు. "ఆషుకి నోటి దూల అన్న విషయం నాకు తెలీదు" అని రీతూ అనేసరికి "కొంచెం ఎడ్జ్ కామెంట్స్ చేస్తది ఆషు. ఎక్కడున్నాం, చుట్టు పక్కల ఎవరున్నారో కూడా చూడకుండా కామెంట్స్ చేసేస్తుంది. నేను హ్యాపీ డేస్ అని ఒక షో చేశా. అందులో ఎక్స్ప్రెస్ హరి వంటి వాళ్లంతా ఉన్నారు. షో జరుగుతూ ఉంటుంది. మైక్ ఆన్ లో ఉంటుంది. మధ్యలో బ్రేక్స్ వస్తాయి. సడన్ గా వెనక్కి వచ్చి పిర్రల మీద కొట్టి పెంచురా కొంచెం పెంచు అంటూ అడల్ట్ డైలాగ్స్ వేసేస్తుంది. అలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి" అని చెప్పి తెగ సిగ్గు పడిపోయాడు రవి.

ఇక రోహిణికి అదే నోటి దూల అని చెప్పుకొచ్చాడు. ఒక షోలో చేస్తూ ఇంకో షో గురించి అక్కడ చెప్తూ ఉంటుంది. ఇక విష్ణు ప్రియాది జీరో ఎమోషన్ అని చెప్పాడు. ఆ మాటకు రీతూ హర్ట్ అయ్యేసరికి "గోకెంత ఫిగర్ ఐతే గోకే వాడిని..నీ ఫ్రెండ్ అని అలా అంటున్నావ్...మీ ఇద్దరూ జనక్ జనక్ పాయల్ బాజే అని తెలుసులే అంటూ సెటైర్స్ వేసాడు. ఎందుకు జీరో ఎమోషన్ అన్నానంటే ఒక లేడీస్ షో చేసేటప్పుడు లేడీ ఎమోషన్స్ గురించి పట్టించుకోకుండా ఊ కొడుతూ నెక్స్ట్ ఏంటి డైరెక్టర్ గారు అని అడిగేది. అప్పుడు తెలిసింది తనలో ఎమోషన్స్ లేవని అందుకే అలా అన్నా" అని సెటైర్ వేసాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.

Podharillu : పోలీస్ స్టేషన్లో చక్రి, మహా.. భూషణ్ ఏం చేయనున్నాడు!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -26 లో..... చక్రి, మహా ఇద్దరు కార్లో వెళ్తుంటే వాళ్ళని ఫాలో చేస్తూ మహా వాళ్ళ నాన్న ప్రతాప్ అతడి కొడుకు ఆది వెళ్తారు. వారితో పాటుగా మహాని పెళ్ళి చేసుకోవాలనుకునే భూషణ్ మరోచైపు ఫాలో చేస్తుంటారు. అయితే ఒక దగ్గర చక్రి , మహా వాళ్ళు దొరికిపోతారు. ఇక మహా వాళ్ళ నాన్న ప్రతాప్.. మహాని రమ్మని చెప్పగా.. ఆ జుట్టోడితో నా పెళ్ళి వద్దు అందుకే పారిపోతున్నానని మహా అంటుంది. చక్రిని చంపేసి నా కూతురిని తీసుకురమ్మని ప్రతాప్ అంటాడు. అప్పుడే వారి మధ్యలోకి బాలు కారులో వేగంగా వచ్చి ఆగుతాడు.