English | Telugu
సిరి - షన్నుల హగ్గుల యుద్ధం అన్ స్టాపబుల్
Updated : Dec 9, 2021
బిగ్‌బాస్ క్లైమాక్స్‌కి చేరుతున్నా కొద్దీ కంటెస్టెంట్‌ల అసలు కూపాలు బయటపడుతున్నాయి. మరీ ముఖ్యంగా షన్ను, సిరిల వ్యవహారం మరీ పీక్స్ చేరడం కాదు మరీ ఇంత వల్గర్ గానా అనే స్థాయికి చేరింది. మాటి మాటికి హగ్గులు.. కిస్సులు.. రెస్ట్ రూమ్ పంచాయితీలు.. ఆ తరువాత ప్రణయ గీతాలు.. నువ్వు లేక నేను లేనని, నన్ను తప్ప హౌస్‌లో మరెవరినీ ఆ దృష్టిలో చూడొద్దని షన్ను సిరిని కట్టడి చేస్తున్న తీరు ప్రేక్షకులకు వెగటు పుట్టిస్తోంది.
ఛాన్స్ చిక్కింది.. షన్నుపై సన్నీ పంచ్ పేలింది
ఈ ఇద్దరు ఫ్రెండ్షిప్ అర్థాన్ని మార్చేస్తున్నారని నెటిజన్‌లు వీరిపై మండిపడుతున్నారు. గురువారం బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు తమాషా టాస్క్ ఇచ్చారు. తమ ఫేవరేట్ హీరోలు ఇంటి సభ్యులు మారి పోయి పాట ప్లే అవుతుంటే అది ఎవరి పాటో వారు స్టేజ్ పైకి వచ్చి పెర్ఫార్మ్ చేయాలి. ఈ టాస్క్‌లో బాలయ్య సన్నీ, మానస్ పవన్‌కల్యాణ్... శ్రీరామ్ .. మెగాస్టార్ చిరంజీవి, షణ్ముఖ్ .. సూర్య.. సిరి జెనీలియా.. కాజల్ .. అతిలోక సుందరి శ్రీదేవి.. ఇక ఒక్కొక్కరు ఒక్కో తారగా మారిపోయారు.
షన్నుపై మాధవీలత సీరియస్.. కోర్టుకి వెళుతుందట
ఇందులో సన్నీ.. కాజల్.., సిరిలతో చేసిన కామెడీ.. వేసిన పంచ్‌లు.. ఓ రేంజ్ లో పేలి నవ్వులు కురిపించాయి. ఈ టాస్క్‌లో బాలయ్య గెటప్‌లో వున్న సన్నీతో కలిసి సిరి స్టెప్పులేసింది. ఇది చూసిన షన్నుకి ఎక్కడో కాలి ముఖం మాడిపోయింది. అక్కడి నుంచి సిరిని దూరం పెట్టడం మొదలుపెట్టాడు.. మళ్లీ హగ్గు కోసం డ్రామా షురూ అనేంతగా వీరి డ్రామా మొదలైంది. ఆ తరువాత అంతా కలిసి స్కిట్ చేద్దామని షన్నుని అడిగితే నాకు రాదు బ్రో అయినా మీరంతా ఒకటి అంటూ రెస్ట్ రూమ్ వైప్ వెళ్లిపోయాడు.. వెనకాలే వెళ్లిన సిరి మళ్లీ డ్రామా మొదలుపెట్టింది. నువ్వు ట్రిప్ అయిన ప్రతి సారి చెప్పడం నాకు నచ్చడం లేదంటాడు షన్ను.. నీ బాధ నాకు అర్థమైందిరా అంటుంది సిరి.. ఎంత వారించినా షన్ను వినకపోవడంతో నువ్వంటే నాకిష్టం అని మళ్లీ హగ్గులేసుకోవడంతో ఎపిసోడ్‌ని ఎండ్ చేశారు. వీరి హగ్గుల తీరు చూసి తట్టుకోలేకపోతున్న నెటిజన్స్ ఈ హగ్గుల యుద్ధం అన్ స్టాపబుల్ అంటూ ట్రోల్ చేస్తున్నారు.