English | Telugu

కావ్యకి వేసిన శిక్ష చూసి దుగ్గిరాల ఫ్యామిలీని నిలదీసిన కనకం!

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -180 లో.. తన తల్లికి ఎదురు తిరిగిందని కావ్యని బయటకు గెంటేస్తాడు రాజ్. నేను ఎక్కడికి వెళ్ళనంటూ కావ్య ఇంటి ముందు వర్షంలో నిల్చొని ఉంటుంది. కావ్యని ఆ పరిస్థితిలో చుసిన రాహుల్, రుద్రాణి సంబరపడతారు. కావ్యని ఇంట్లో నుండి గెంటేసారని ఆ తల్లి కొడుకులని అంటారు. అప్పుడు రాజ్ అవమానంతో ఆఫీస్ కి వెళ్ళడు. అప్పుడు ఆఫీస్ బాధ్యతలు నువ్వు తీసుకునేలా నేను చేస్తానని రుద్రాణి చెప్తుంది.

మరొకవైపు కావ్య దగ్గరికి కళ్యాణ్ వచ్చి వర్షంలో తడవకుండా చూస్తాడు. కావ్య మాత్రం నాపై గౌరవం ఉంటే మీరు ఇక్కడ నుండి వెళ్ళండని కళ్యాణ్ తో కావ్య చెప్తుంది. అటు అన్నయ్య, ఇటు వదిన ఎవరు తగ్గేలాలేరు వదిన వాళ్ళ అమ్మానాన్నలకి చెప్తే వాళ్ళే వచ్చి తీసుకొని వెళ్తారని కనకంకి ఫోన్ చేసి కళ్యాణ్ జరిగిందంతా చెప్తాడు. కాసేపటికి కనకం, కృష్ణమూర్తి ఇద్దరు బయలుదేరి కావ్య దగ్గరికి వెళ్తారు. మరొక వైపు అపర్ణ దగ్గరికి ఇందిరాదేవి, సీతరామయ్య వచ్చి.. రాజ్ కి నువ్వు అయిన నచ్చజెప్పి కావ్యని ఇంట్లోకి తీసుకొని రమ్మని చెప్పమని అడుగుతారు. నేను అలా చెప్పలేను.. వాడు నా మాట కూడా వినే పరిస్థితిలో లేడని అపర్ణ చెప్పగానే.. ఏం మాట్లాడకుండా ఇద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. మరొకవైపు కావ్య దగ్గరికి కనకం, కృష్ణమూర్తి వచ్చి.. నువ్వు ఏం తప్పు చేసావో వాళ్ళనే అడుగుతానని కనకం కోపంగా కావ్యని తీసుకొని వెళ్తుంది. తన కూతురికి ఇంట్లో అందరు ఉండి కూడా ఇంత పెద్ద శిక్ష వేశారు ఎందుకని కనకం నిలదీస్తుంది. మీ కూతురు చేసిన తప్పు తెలియకుండా మమ్మల్ని తప్పు పట్టడం కరెక్ట్ కాదని అపర్ణ అంటుంది. తప్పు చేస్తే ఇలాగేనా శిక్ష వేసేదని కనకం ఎమోషనల్ అవుతుంది.

కనకం అలా అనగానే పక్కనే ఉన్న స్వప్న.. అలా నిజం తెలుసుకోకుండా మాట్లాడకని అంటుంది. అలా స్వప్న అనగానే కనకం కోపంగా నువ్వు మాట్లాడుతూన్నావా? నా కూతురు గురించి మాట్లాడే అర్హత నీకు లేదని స్వప్నని తిడుతుంది కనకం. ఆ తర్వాత రాజ్ దగ్గరికి కృష్ణమూర్తి వెళ్లి.. నా కూతురిని క్షమించండని బ్రతిమిలాడుతాడు. నేను క్షమించలేనని రాజ్ కచ్చితంగా చెప్తాడు. దాంతో నా ఇంటికి నా కూతురిని తీసుకొని వెళ్తానని కృష్ణమూర్తి చెప్తాడు. అందరు మాట్లాడకుండా మౌనంగా ఉంటారు. సీతరామయ్య, ఇందిరాదేవిలకి రాజ్ చేస్తుంది తప్పని తెలిసిన రాజ్ ఎవరి మాట వినే స్టేజ్ లో లేడని సైలెంట్ గా ఉంటారు. ఆ తర్వాత కనకం, కృష్ణమూర్తి ఇద్దరు కావ్యని తీసుకొని బయటకు వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.