English | Telugu
మొన్న యాంకర్ రవి...ఇప్పుడు..
Updated : Dec 11, 2021
బిగ్‌బాస్ క్లైమాక్స్ కి చేరుతున్నా కొద్దీ హౌస్‌లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. సిరిని కంట్రోల్ చేస్తున్నానంటూ షన్ను కంట్రోల్ తప్పేస్తున్నాడు. అంతే కాకుండా కంట్రోల్ చేస్తున్నాననే నెపంతో సిరిని టార్చర్ పెడుతున్న తీరు నెటిజన్‌లకు ఆగ్రహాన్నితెప్పిస్తోంది. ఇదిలా వుంటే ఈ ఆదివారం ఎలిమినేషన్ షాకింగ్‌గా వుండే అవకాశం వుందని వార్తలు వినిపిస్తున్నాయి. 12 వ వారం యాంకర్ రవిని ఎలిమినేట్ చేసి షాకిచ్చినట్టుగానే ఈ వారం బిగ్‌బాస్ అంతకు మించి అనే స్థాయిలో షాక్ ఇవ్వబోతున్నారని ప్రచారం మొదలైంది.
బిగ్‌బాస్ బండారం బయటపెట్టిన రవి
ఇంతకీ బిగ్‌బాస్ ఈ వారం షాక్ ఇవ్వబోయేది మరనెవరికో కాదు `బ్రహ్మ` అని నాగ్ పేరు పెట్టిన షన్నుకి. యూట్యూబ్‌లో మిలియన్‌ల కొద్దీ ఫాలోవర్స్ వున్నా బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చాక సిరి కారణంగా అతని ప్రవర్తన చాలా మారింది. ఏ స్థాయిలో అంటే వీడెందుకు ఇంకా హౌస్‌లో కంటిన్యూ అవుతున్నాడ్రా బాబూ అని ఆడియన్స్ అనుకునేంత. యూట్యూబర్‌గా వున్న క్రేజ్ ని తన యాటిట్యూడ్‌తో బిస్కెట్ అయ్యేలా చేసుకున్నాడు షన్ను. అదే అతన్ని గేమ్ నుంచి ఎలిమినేట్ అయ్యేలా చేయబోతోందన్నది తాజా వాదన.
ఓ వైపు సిరి ఫ్రెండ్ అంటూనే తను ఎవరితో అయినా క్లోజ్ అవుతున్నట్టుగా అనుమానం మొదలైతే షన్ను ఓ సైకోలా బిహేవ్ చేస్తూ సిరిని మానసికంగా టార్చర్ చేసేస్తున్నాడు. ఇదే అతన్ని ఆడియన్స్ లో అథఃపాతాళానికి తొక్కేసింది. అంతే కాకుండా ఛాన్స్ చిక్కినప్పుడల్లా సిరికి హగ్గులు.. కిస్సులు ఇచ్చేస్తూ వీర లెవెల్లో రెస్ట్ రూమ్ దగ్గర రొమాన్స్ చేసేయడం కూడా షన్నుపై అభిమానుల్లో అసహ్యం కలిగేలా చేస్తోంది. ఇదే అతన్ని ఈ వారం ఎలిమినేట్ అయ్యేలా చేయబోతోందని వార్తలు షికారు చేస్తున్నాయి. ఆడియన్స్ పోల్ ని బట్టే ఎలిమినేషన్ అని చెబుతూ వస్తున్న బిగ్‌బాస్ నిర్వాహకులు షన్ను విషయంలో అదే ఫాలో అవుతారా లేక సొంత నిర్ణయం తీసుకుని షన్నుని సేవ్ చేస్తారా అన్నది తెలియాలంటే శనివారం ఎపిసోడ్ చూడాల్సిందే.