English | Telugu
రీఎంట్రీ ఇచ్చిన శ్రీసత్య...మరి చమ్మక్ చంద్ర ఎంట్రీ ఎప్పుడో?
Updated : Dec 1, 2022
జబర్దస్త్ కామెడీ షోలో కనిపించే లేడీ కమెడియన్స్ లో శ్రీసత్యకి ఒక మోస్తరు పేరు ఉంది. ఈమె చమ్మక్ చంద్ర టీమ్ ద్వారా పరిచయం ఐన లేడీ కమెడియన్. చంద్ర స్కిట్స్ అన్నీ కూడా ఫామిలీ డ్రామాలే. లేడీస్ ని టార్గెట్ చేసుకునే స్కిట్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాడు. అలా తన స్కిట్స్ లో లేడీ కమెడియన్ పాత్రల కోసం శ్రీసత్యని తెచ్చుకున్నాడు చమ్మక్ చంద్ర. ఆమె తనకున్న కామెడీ టైమింగ్ తో మంచి సక్సెస్ అందుకుంది.
తర్వాత కొంతకాలానికి చంద్ర జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయాడు. ఇక నెమ్మది నెమ్మదిగా శ్రీసత్య జారుకుంది. తర్వాత కొన్ని కామెడీ షోస్ లో కనిపించారు ఇద్దరు. కానీ పెద్దగా వర్కౌట్ అవలేదు. ఇక సోషల్ మీడియాలో చంద్ర, సత్య గురించి చాలా రూమర్స్ వచ్చాయి. ఐతే ఆ కామెంట్స్ కి సమాధానం ఇచ్చింది సత్య. తమది గురుశిష్యుల బంధం అని చెప్పింది. ఆ తర్వాత కొంతకాలం వరకు బుల్లితెర మీద కనిపించలేదు శ్రీసత్య. కానీ సడెన్గా ఎక్స్ట్రా జబర్దస్త్ లో రీ-ఎంట్రీ ఇచ్చింది. అది కూడా తాగుబోతు రమేష్ టీమ్ లో చేసింది. ఇక ఇదే టీమ్ లో మరో లేడీ కమెడియన్ రౌడీ రోహిణితో కలిసి స్కిట్ చేసింది. ఐతే "శ్రీసత్య మళ్ళీ షోలో రీఎంట్రీ ఇచ్చారు..చమ్మక్ చంద్ర రీఎంట్రీ కోసం వెయిటింగ్, సత్య చాలా మంచి యాక్టర్" అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.