English | Telugu

సెంటిమెంట్ సుబ్బయ్యతో ఆలీ ముచ్చట్లు!

ఆలీతో సరదాగా షోకి ఎంతోమంది లెజెండరీస్ వచ్చి ఎన్నో విషయాలు చెప్పడం ఆడియన్స్ కి కూడా ఈ షో నచ్చడంతో ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు తాజాగా ముత్యాల సుబ్బయ్య గారిని షోకి తీసుకొచ్చారు ఆలీ. తెలుగు మూవీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్పెషల్ ప్లేస్ క్రియేట్ చేసుకుని, మంచి గుర్తింపు పొందినప్పటికీ మామూలు మనిషిలా మెలగడం, మాట్లాడటం ఒక్క ముత్యాల సుబ్బయ్య గారికే సొంతం. పెద్దా, చిన్నా తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ‘గురువా’ అంటూ పిలవడం ఆయన సింప్లిసిటీకి నిదర్శనం.

"నా స్కూల్ నుంచి చాలా మంది వచ్చారు. నాది సెంటిమెంట్ స్కూల్. అందుకే చాలామంది నన్ను సెంటిమెంట్ సుబ్బయ్య అనే పేరుతో పిలుస్తారు. ఐతే బోయపాటి శీను స్కూల్ వేరు . ఆయన అన్ని నరకడమే పనిగా పెట్టుకున్నాడు. యాక్షన్ అని నేను చెప్పింది "మూడుముళ్ల బంధం" మూవీ కి . కానీ ఆ మూవీ ఫ్లాప్ అయ్యింది.

నేను రాజశేఖర్ తో ఎక్కువ సినిమాలు చేసాను. కోడి రామకృష్ణ గారు నాకంటే ఒక సినిమా ఎక్కువ తీశారనుకుంటా ఆయనతో. దాసరి గారు, బాలు గారి మీద పర్వతాలు- పానకాల సినిమా తీసాం, కష్టపడి చేశాంగానీ సినిమా ఆడలేదు.హిట్లర్ సినిమాను మలయాళంలో చూసిన ఎడిటర్ మోహన్ గారు ఫోన్ చేసి నన్ను డైరెక్షన్ చేయమన్నారు. దేవుడా అదృష్టం ఈ రూపంలో వచ్చిందా అనుకుని వెంటనే చిరంజీవి గారిని కలిసాను. అలా ఆ సినిమా తీసాను" అంటూ చెప్పుకొచ్చారు సుబ్బయ్య గారు.