English | Telugu

ఆధారాలు సంపాదించలేకపోయిన కృష్ణ.. ఇంట్లో నుండి వెళ్ళిపోనుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -111లో.. కృష్ణ సీనియర్ డాక్టర్ గురించి అంతలా ఆరాటపడడం ఏంటో నాకు అర్ధం కావటం లేదు. నీ కాపురాన్ని కాపాడుకో అంటూ పరిమళ డాక్టర్ మురారికి చెప్తుంది. పరిమళ ఇంతలా చెప్తుందంటే ఏం జరుగుతుంది.. కృష్ణ బిహేవియర్ బానే ఉంది కదా ఎందుకిలా చేస్తుందని ఆలోచిస్తాడు.

మరోవైపు గౌతమ్ ఇంటి అడ్రస్ కోసం కృష్ణ వెతుకుతుంది. ఎలాగైనా కృష్ణ ఏ తప్పు చెయ్యలేదని నిరూపించుకోవాలని ట్రై చేస్తుంది. "గౌతమ్ సర్ మీరు రాసిన టాబ్లెట్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పారు కదా.. మీరు చెప్పినట్లే వచ్చాయి. అదే విషయం మీరు వచ్చి చెప్పండని తనలో తాను అనుకుంటూ బాధపడుతుంది" కృష్ణ. ఇంతలోనే కృష్ణకి మురారి ఫోన్ చేసి.. ఎక్కడున్నావని అడుగుతాడు. గౌతమ్ సర్ ఇంటి అడ్రెస్ కోసం వెతుకుతున్నాను.. సర్ మీరు పోలీస్ కదా కొంచెం హెల్ప్ చేస్తారా అని కృష్ణ అనగానే.. మురారి కోపంగా ఫోన్ కట్ చేస్తాడు. కృష్ణ ఏంటి.. గౌతమ్ గురించి ఆలోచిస్తుందని మురారి దిగులుగా ఇంటికి వస్తాడు. ఇక ఇంట్లో హాల్లోనే అందరూ ఉంటారు. మురారిని చూసి భవాని.. "ఏమైంది ఆలా ఉన్నావ్" అని అడుగుతుంది. వర్క్ టెన్షన్ అని చెప్పేసి మురారి లోపలికి వెళ్ళిపోతాడు.. ఆ తర్వాత కృష్ణ కూడా ఇంటికి వస్తుంది. ఏమైంది కృష్ణ ఉంటున్నావా? వెళ్తున్నావా అని ముకుంద అడుగుతుంది. వెళ్తున్నాను.. నేను ఎంతో ట్రై చేశాను కానీ ఆధారాలు సంపాదించలేకపోయానని కృష్ణ చెప్తుంది. "కృష్ణ.. వెళ్లిపోవడమే పరిష్కారం కాదు కదా.. భవాని అక్కని క్షమించమని అడుగు" అని రేవతి అంటుంది. లేదు అత్తయ్య నేను తప్పు చేయనీది క్షమించమని అడగను అని కృష్ణ అంటుంది. నా నిర్ణయం మార్చుకోను అని కచ్చితంగా చెప్తుంది భవాని. తిరిగి తిరిగి అలసిపోయాను.. ఈ ఒక్క రాత్రికి ఉండి ఉదయమే వెళ్లిపోతాను అని కృష్ణ చెపుతుంది. ఉదయం లేచి ఏ కన్నీటి గాథ చెప్పకుండా త్వరగా వెళ్ళమని భవాని చెప్తుంది.

కృష్ణ తన గదిలో ఆలోచిస్తుండగా మురారి వస్తాడు. మీరు ఎప్పుడు వచ్చారని కృష్ణ అనగానే.. "నాకేం అందరిని వెతికే పని లేదు కదా" అంటూ మురారి కోపంగా మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.