English | Telugu

కొత్తకోడలిని పంజరంలో బంధించారా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సిరీయల్ బుధవారం నాటి ఎపిసోడ్‌-50లో... మీనాక్షి, కనకం మారు వేశాల్లో వస్తారు. వారిని చూసిన కళ్యాణ్ వారిద్దరికి వస్తాడు.. మీరిద్దరూ ఎవరో నాకు తెలుసు. ఈ రిసెప్షన్ లో జోకర్ పర్ఫామెన్స్ పెట్టించమని చెప్పాను. నాకు టెన్షన్ గా ఉంది. మీ అమ్మాయిని చూసి వెళ్ళిపోండని చెప్తాడు. ఆ తర్వాత మీడియా అంతా రాజ్, కావ్యల కోసం ఎదురు చూస్తుంటారు.

కాసేపడికి రాజ్ ఒక్కడే రావడంతో అది గమనించిన మీడియా వాళ్ళు నేరుగా రాజ్ దగ్గరికి వెళ్తారు. పెళ్ళికూతురు రాలేదేంటి, అసలు వస్తారా? రారా? అని మీడియావాళ్ళు అడుగుతారు. వాళ్ళు అమ్మాయిలు రెడీ అవ్వడానికి టైం పడుతుంది కదా‌‌.. పెళ్ళికూతురు తప్పకుండా వస్తుందని రాహుల్ చెప్తాడు. రాజ్ మీడియా ముందు కవర్ చేయలేక సతమతపడతాడు. రాహుల్ ని వెతుక్కుంటూ స్వప్న రిసెప్షన్ కి వస్తుంది. కానీ ఎవరికి కనిపించకుండా కూల్ డ్రింక్స్ మోసే వెయిటర్ గా రెడీ అయి వస్తుంది. మరోవైపు పేదింటి అమ్మాయని తనని పంజరంలో బంధించారా అని మీడియా వాళ్ళు రాజ్ ని
అడుగుతారు. మీకు ఏమనిపిస్తే అది అడిగేస్తారా.. మా వంశానికి ఒక పేరుంది. అసలు ఏం అనుకుంటారని మీడియా వాళ్ళని రాజ్ కోప్పడతాడు. అప్పుడు కళ్యాణ్ తనని పక్కకి తీసుకెళ్ళి కూల్ గా ఉండమని చెప్తాడు. మరి ఆ అమ్మాయి గదిలో‌ లేదని రేఖ వచ్చి రాజ్ తో చెప్పేసరికి అందరూ షాకవుతారు. మొత్తం అంతా వెతికినా ఎక్కడా కనిపించలేదని రేఖ చెప్తుంది.

కావ్య వెళ్ళిపోయిందేమోనని రాజ్ తో పాటు దుగ్గిరాల కుటుంబమంతా టెన్షన్ పడుతుంటారు. కాసేపటికి కావ్య అక్కడికి వస్తుంది. అలా వచ్చి రాగానే సీతారామయ్య, నానమ్మల ఆశీర్వాదం తీసుకుంటుంది కావ్య. "ఈ దుగ్గిరాల వంశానికి వన్నె తెచ్చావమ్మా" అని సీతారామయ్య అంటాడు. ఆ తర్వాత రాజ్ పక్కన నిల్చుంటుంది కావ్య. తనతో మెల్లిగా మాట్లాడుతుంది. రాననుకున్నారా అని కావ్య అనగా.. పారిపోయావనుకున్నా అని రాజ్ అంటాడు. మీరు నా ఫ్యామీలీని అవమానించిన నేను మాత్రం మీ వంశ గౌరవాన్ని నిలబెట్టానని కావ్య చెప్తుంది. మీడియా వాళ్ళ ముందు రాజ్, కావ్య ఇద్దరు చిరునవ్వుతో ఉన్నట్టు నటిస్తుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.