English | Telugu
అప్పుని తీసుకెళ్ళిన పోలీసులు.. కావ్య వేసిన డిజైన్స్ ని మెచ్చుకున్న రాజ్!
Updated : Jul 5, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -139 లో... రాకేష్ తలపై అప్పు కొట్టినందుకు టెన్షన్ పడుతుంది. అప్పుడే అప్పు దగ్గరికి కనకం రాగా.. కనకం పై అప్పు కోప్పడుతుంది. నాకు చిరాకు తెప్పించకు ఇక్కడ నుండి వెళ్ళమని అంటుంది. ఎన్నడూ లేంది అప్పు టెన్షన్ పడుతుందేంటని కనకం అనుకుంటుంది.
మరొక వైపు రాజ్, కావ్య ఆఫీస్ కి వస్తారు. రాజ్ తో వచ్చిన కావ్యని చూసి.. అక్కడి సెక్యూరిటీ గుడ్ మార్నింగ్ మేడం అని చెప్తాడు. ఇప్పుడు మీ సర్ తో వచ్చానని రెస్పెక్ట్ ఇస్తున్నారా అని కావ్య అంటుంది. అప్పుడు చేసిన తప్పుకి ఇప్పటి వరకు శిక్ష అనుభవిస్తూనే ఉన్నాం మేడం అని సెక్యూరిటీ అంటాడు. ఆఫీస్ లోపలికి వెళ్లిన రాజ్ అక్కడి ఎంప్లాయిని డిజైన్ పూర్తి అయ్యాయా అని అడుగుతాడు. ఇంకా లేదు సర్ అని శృతి చెప్తుంది. ఇప్పుడు ఫారెన్ నుండి క్లైంట్స్ వచ్చి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలని రాజ్ శృతిపై అరుస్తాడు రాజ్. శృతి కొన్ని డిజైన్ చూపించగా బాలేవని మళ్ళీ తొందరగా రెడీ చేసి తీసుకొని రా అని రాజ్ చెప్తాడు. రాజ్ క్లయింట్ దగ్గరికి వెళ్లి.. మా డిజైనర్ ఇంకా రాలేదు. కొంచెం టైం కావాలని అడుగుతాడు. అందుకు వాళ్ళు సరే అంటారు. మరొక వైపు కనకం ఇంటికి పోలీసులు వస్తారు. ఎందుకు ఇలా వచ్చారని కృష్ణమూర్తి పోలీసులని అడుగగా.. "మీ కూతురు అప్పు, రాకేష్ అనే అబ్బాయి తలపై కొట్టిందని" అని చెప్పగానే కృష్ణమూర్తి, కనకం ఇద్దరు షాక్ అవుతారు. ఆ తర్వాత అప్పుని పోలీస్ లు తీసుకొని వెళ్తారు. వద్దని కనకం, కృష్ణమూర్తి ఇద్దరు ఎంత బ్రతిమిలాడినా వినిపించుకోకుండా తీసుకొని వెళ్తారు. మరొక వైపు రాజ్ పడుతూన్న టెన్షన్ చూడలేక శృతి దగ్గరికి కావ్య వెళ్లి తనే డిజైన్ రెడీ చేస్తోంది. మరొక వైపు స్టేషన్ లో ఉన్న అప్పు దగ్గరికి కనకం, కృష్ణమూర్తి వెళ్లి.. అప్పుని వదిలిపెట్టమని ఎస్సై ని రిక్వెస్ట్ చేస్తారు. ఎంత రిక్వెస్ట్ చేసిన ఎస్సై, అప్పుని వదిలిపెట్టనని అంటాడు.
ఆ తర్వాత కావ్య డిజైన్ రెడీ చేసి.. నువ్వు తీసుకొని వెళ్లి మీ సర్ కి చూపించు అని శృతితో అనగానే.. లేదు మేడం ఆ క్రెడిట్ మీకే దక్కాలి మీరే వెళ్ళండని శృతి అంటుంది. కావ్య వెళ్లి రాజ్ కి డిజైన్ చూపించగానే నీకేం తెలుసు డిజైన్ గురించి అని డిజైన్ చూడకుండానే చింపిస్తాడు. ఆ తర్వాత కావ్య రెడీ చేసిన డిజైన్ మళ్ళీ శృతితో కావ్య పంపిస్తుంది. బాగున్నాయ్ డిజైన్ అని శృతిని మెచ్చుకుంటాడు రాజ్. క్లయింట్స్ కి వెళ్లి చూపించగానే బాగున్నాయంటూ చెప్పగానే రాజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.