English | Telugu

మహంకాళి భోనాల జాతరలో కృష్ణ ముకుంద మురారి, మల్లి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -208 లో.. మధు, అలేఖ్య ఇద్దరు కలిసి ముకుంద, మురారిలు కలిసి ఉన్న ఫోటోలని భవానికి చూపించడానికి వెళ్తుండగా రేవతి చూసి ఏంటని అడుగగా.. వాళ్ళిద్దరి ఫోటోలు చూపిస్తాడు మధు. దాంతో వాళ్ళిద్దరిని పక్కకి తీసుకెళ్ళి.. "ముకుంద మురారీల ప్రేమ గతం.. ఈ విషయం మీకన్నా ముందే నాకు తెలుసు. ఈ విషయం ఎవరికి తెలియకూడదు. ముఖ్యంగా భవాని అక్కయ్యకి తెలియకూడదు" అని మధు, అలేఖ్యలతో రేవతి అంటుంది. దాంతో ఈ విషయం ఎవరికి చెప్పనని రేవతికి మధు మాటిస్తాడు.

ఆ తర్వాత కృష్ణ, మురారి కలిసి భోనాల కోసం ఏర్పాట్లు చేస్తుంటారు‌. తన ప్రేమ దక్కాలని మొక్కుకొని మురారి కోసం ఒక ప్రేమలేఖ రాస్తుంది కృష్ణ. దానిని తన కొంగుముడికి కట్టుకొని భోనం దగ్గరికి వెళ్తుంది. అక్కడ భవాని అందరూ కలిసి భోనాలు ఎత్తుకొని ఇంటి నుండి మహంకాళి టెంపుల్ కి వెళ్తారు. మురారి ఫ్యామిలీతో కలిసి మహంకాళి భోనాల దగ్గరికి వస్తాడు. అయితే అదే సమయంలో మురారికి గౌతమ్ నుండి కాల్ వస్తుంది. ఏంటి గౌతమ్ చాలా రోజులకి కాల్ చేసావ్? స్వప్న తో నీ పెళ్ళి ఫిక్స్ అయిందా? కంగ్రాట్స్ ఆ విషయం చెప్పడానికే కాల్ చేసావా అని మురారి అడుగుతాడు. స్వప్న ఒక కార్ యాక్సిడెంట్ లో చనిపోయిందని, యాక్సిడెంట్ చేసింది అరవింద్ అని చెప్తాడు గౌతమ్. అవునా మరి అతనికి శిక్ష పడిందా అని మురారి అడుగగా.. లేదు అతను డబ్బు పలుకుబడి ఉపయోగించి తప్పించుకున్నాడు. ఇప్పుడు మహంకాళి గుడికి ఫ్యామిలీతో వస్తున్నాడంట అని గౌతమ్ చెప్తాడు. సరే అయితే నువ్వు కూడా రా, నేను ఇక్కడే ఉన్నానని మురారి అనగా.. ఒక గంటలో అక్కడ ఉంటానని గౌతమ్ అంటాడు. మరోవైపు అరవింద్ వాళ్ళ ఫ్యామిలీని తీసుకెళ్ళి మహంకాళి టెంపుల్ కి వస్తుంటాడు.

అయితే టెంపుల్ లో కృష్ణ, ముకుంద, భవాని, రేవతి భోనాలతో ప్రదక్షిణలు చేస్తుండగా మధు వ్లాగ్ చేస్తుంటాడు. అదే సమయంలో భవాని ముందు మార్కులు కొట్టేయాలని కృష్ణ భోనాన్ని పట్టుకోకుండా నడిచి భవాని అత్తయ్య దగ్గర సభాష్ అనిపించుకుంటానని మురారీతో కృష్ణ చెప్పి.. భోనం పట్టుకోకుండా ముందుకు నడుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.