English | Telugu

Krishna Mukundha Murari : కృష్ణ మైండ్ బ్లాక్ చేసే ముకుంద ప్లాన్ ఏంటి?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -309 లో.. మెల్లి మెల్లిగా కృష్ణకి మురారి దగ్గర అవుతున్నాడని కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే కృష్ణ దగ్గరికి రేవతి వస్తుంది. తన సంతోషాన్ని రేవతితో షేర్ చేసుకుంటుంది. ఏసీపీ సర్ మనసులో నాకు త్వరలోనే స్థానం లభిస్తుందని కృష్ణ అంటుండగా.. ముకుంద వచ్చి అది అవదమ్మ అన్నట్టుగా లోపలికి వస్తుంది.

ఆ తర్వాత ఇక ఇలాంటి మాటలకి బయపడే రోజులు పోయాయి ఏసీపీ సర్ నాకు దగ్గర అవుతుంటే ఇలాంటి వాటికి బయపడాల్సిన అవసరం లేదని ముకుందతో కృష్ణ అనగానే.. మీరెంత నవ్వుకున్నా ఈ రెండు మూడు రోజులే. నా ప్లాన్ తో మీకు మైండ్ బ్లాక్ అవుతుందని ముకుంద అంటుంది. ఈ అర్ధం పర్థం లేని మాటలు ఎప్పుడు ఉండేదే కాదా అని రేవతి అంటుంది. ఇక మీరే నాకూ అసలైన అత్త కాబోతున్నారని ముకుంద అనగానే.. ఇద్దరు షాక్ అవుతారు. ఆ తర్వాత కృష్ణ ముకుందల మధ్య మాటల యుద్ధమే జరుగుతుంది. నేను చేసే ప్లాన్ ఏంటో ముందు చెప్పే అలవాటు లేదని ముకుంద అంటుంది. నేను వెళ్తున్న మళ్ళీ మురారి నీకోసం ఇక్కడకి రావడం ఇష్టం లేదు. నువ్వు త్వరగా రా అంటూ ముకుంద వెళ్ళిపోతుంది.

మరొక వైపు కృష్ణ, ముకుంద, మురారి షాపింగ్ కి వెళ్తారు‌. మురారి పక్కన కృష్ణ కూర్చోబోతుంటే.. నేను కూర్చుంటాని కృష్ణని వెనక్కి పంపిస్తుంది ముకుంద. మరొకవైపు రేవతి వాళ్ళని చూసి.. కృష్ణ మురారి మధ్యలో ఎప్పుడు ఈ ముకుంద వస్తుంది. దాని అడ్డు తొలగించు. అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటానని మధుతో రేవతి అంటుంది. ఆ తర్వాత కోపంగా ఉన్న రేవతి దగ్గరికి మధు వచ్చి.. మాట్లాడుతాడు. అప్పుడే కృష్ణకి వచ్చిన డౌట్ ని మధుకీ మెసేజ్ చేస్తుంది. ఆ మెసేజ్ ని రేవతికి చదివి వినిపిస్తాడు మధు. ముకుంద మురారి లు అమెరికా వెళ్ళాక అక్కడ వీసా పారేసి మురారితో అక్కడే ముకుంద ఉంటుంది కావచ్చని కృష్ణ డౌట్ ని మధు చెప్పగానే.. రేవతి షాక్ అవుతుంది..

ఆ తర్వాత మురారి దగ్గరికి మధు వెళ్లి.. ఇప్పుడు అమెరికా ఎందుకు అని అడుగుతాడు. వెళ్ళాలి. వెళ్తే నా గతం నాకు త్వరగా గుర్తుకు వస్తుంది కదా అని మురారి చెప్తాడు. కాసేపటికి కృష్ణ దగ్గరకు మురారి వచ్చి.. ఎవరిని చూసిన సొంతవాళ్లు అనే ఫీలింగ్ రావడం లేదు. ఒక మిమ్మల్ని చూస్తేనే వస్తుందని మురారి అనగానే.. కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత కృష్ణకి మురారి చీర ఇస్తాడు. ఇది కట్టుకొని ఎయిర్ పోర్ట్ కీ రావాలని మురారి చెప్పగానే.. కృష్ణ బాధపడుతుంది. తరువాయి భాగంలో మురారి ఇచ్చిన చీర కట్టుకొని కృష్ణ మురిసిపోతుంటుంది. మురారి వచ్చి ఎయిర్ పోర్ట్ కి వెళ్లేటప్పుడు కట్టుకోమని చెప్పాను కాదా అని మురారి అనగానే.. కృష్ణ డైవర్ట్ చేస్తూ కాఫీ కావాలా అని అడుగుతుంది. కాఫీ అనేది సెకండ్. మిమ్మల్ని చూడడం కోసం వచ్చానని మురారి చెప్తాడు. అసలు ముకుంద ప్లాన్ ఏంటి? మురారి అమెరికా వెళ్తాడా లేదా తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.