English | Telugu

విరుచుకుపడిన అత్త.. భయంతో తగ్గిన నిజాయితీ గల కోడలు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-303 లో.‌ . స్టోర్ రూమ్ లో ఉన్న కృష్ణకి మురారి హెల్ప్ చేస్తుంటాడు. మరొకవైపు భవాని దగ్గరికి ప్రసాద్ వచ్చి మాట్లాడతాడు. అన్నయ్య దగ్గరికి మన పవర్ స్టేషన్ ప్రాజెక్టు గురించి వెళ్లి వచ్చానని అంటాడు. మురారీ గురించి ఈశ్వర్ ఏమన్నాడని భవాని అడుగగా.. ప్రాణాలతో ఉన్నాడు. అదే చాలని అన్నాడు. ఫస్ట్ ఈ వార్త విని రెండు రోజులు భోజనం చేయలేదంట. కానీ ఒక మాట అన్నాడు వదిన.. నాకు అది నచ్చలేదని ప్రసాద్ అంటాడు. ఏంటది అని భవాని అడుగగా.. ముకుంద, మురారీల పెళ్ళి చేస్తే బాగుంటుందని చెప్పాడని భవానీతో ప్రసాద్ అంటాడు‌. ఇక భవానీ ఆలోచిస్తుంటుంది. సారీ వదిన అని ప్రసాద్ అనగా.. ఇందులో సారీ చెప్పడానికి ఏం ఉంది ప్రసాద్, తన అభిప్రాయం తను చెప్పాడని అంటుంది. ఆదర్శ్ వచ్చాక ఇవన్నీ తెలుసుకొని ఈ ఇంట్లో ఉంటాడంటావా ప్రసాద్ అని భవాని అనగా.. మీరు చెప్తే ఉంటాడేమోనని ప్రసాద్ అంటాడు.

మరొకవైపు స్టోర్ రూమ్ లో ఉన్న ముకుంద, మురారీలు అంతా క్లీన్ చేస్తారు. నీ పేరేంటని మురారి అడుగాగ.. నా పేరు వేణి అని పిలవమని కృష్ణ అంటుంది. ఆ తర్వాత ఫ్రెష్ అయి తులసి కోటకి పూజ చేస్తుంది కృష్ణ. అది బిల్డింగ్ పైన ఉండి చూస్తాడు. ఇక హారతి తీసుకోవడానికి మురారి పరుగెత్తుకుంటూ రావడంతో కాలు స్కిడ్ అవుతుంది. ఇక కృష్ణ హారతి తీసుకొని పరుగెత్తుకుంటూ వస్తుంది. అందరు టెన్షన్ పడతారు. ఆ తర్వాత మురారిని తన గదిలోకి తీసుకెళ్ళమని భవాని అంటుంది. ఏం చదివావని కృష్ణని భవాని అడుగుతుంది.. మా ఏసీపీ సర్ ఎంబీఏ చదివించాడని కృష్ణ చెప్తుండగా.. నోర్ మూసేయ్ ఇంకోసారి ఏసీపీ సర్ అన్నావీ మర్యాదగా ఉండదని అంటుంది. సంస్కారం, సిగ్గు, శరం, రోషం ఇవేమీ లేవా? వద్దన్నా ఇంకడెందుకుంటున్నావ్? మురారిని ఇంకా ఏం చేద్దామని వచ్చావని కృష్ణని భవాని అడుగుతుంది.

నిజం ఎప్పుడు అబద్ధం కంటే నమ్మకంగా ఉంటుంది . అందుకే అందరు అబద్దాన్నే నమ్ముతారని భవానితో కృష్ణ అనగానే.. తెలివిగా మాట్లాడుతున్నాని అనుకుంటున్నావా అని భవాని అంటుంది. లేదు అత్తయ్య తెలుసుకొని మాట్లాడుతున్నానని కృష్ణ అనగానే‌‌.. ఇంకడి నుండి వెళ్ళిపోమని రేవతిని చెప్పమంటుంది భవాని. ఏసీపీ సర్ ని జీవితాంతం భ్రమలోనే ఉంచుతారా? నెమ్మదిగా గతం గుర్తుకుచేద్దామని కృష్ణ అనగానే.. చేద్దాం, అది నువ్వు ముందు దూరమైనప్పుడుణ వాడు నిన్ను పూర్తిగా మర్చిపోయినప్పుడు తప్పకుండా గుర్తుచేస్తానని, నాకు సలహాలిస్తే అవుటవుజ్ లో కూడా ఉండవని కృష్ణతో భవాని అంటుంది‌.

మరొకవైపు కృష్ణ గదిలోని ఫోటోలని, వస్తువులని అన్నింటికి ఒకబ్యాగ్ లో వేస్తుంది ముకుంద. ఇక కిచెన్ లో ఉన్న రేవతి.. ఎందుకు కృష్ణని భవాని అక్క నమ్మడం లేదని రేవతి అనుకుంటుంది. మరొకవైపు లోహపు కృష్ణుడి విగ్రహాన్ని చూసిన మురారికి గతం గుర్తుకొస్తుంటుంది. ఇక తలపట్టుకొని మురారి బాధపడుతుండగా అందరు వస్తారు‌. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.