English | Telugu

మీ అందరి ప్రేమతో నాకేం అవ్వదు!

సీనియర్ నటి షానూర్ సనా బేగం. వెండితెరపై ఎన్నో సినిమాలలో నటించింది. ప్రతి ఇంట్లోని ఒక అమ్మలా కనిపించే సన.. అందరికి సుపరిచితమే. వెండి తెరపై సపోర్ట్ రోల్స్, తల్లి పాత్రలలో ఇమిడిపోయి అందరిని మెప్పిస్తుంది సనా. తను ఇప్పటివరకు దాదాపు అందరు అగ్రహీరోల సినిమాలల్లో సపోర్టింగ్ రోల్స్ చేసి పేరు సంపాదించుకుంది.

సనా.. అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై నటించి.. తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. మొదటగా నాగార్జున నటించిన సూపర్ హిట్ మూవీ 'నిన్నే పెళ్లాడతా' సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసి.. ఇప్పటివరకు తన కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తుంది సనా. అంతేకాకుండా బుల్లితెరపై అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన 'చక్రవాకం' సీరియల్ లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాకుండా ఈ మధ్య కాలంలో వచ్చిన సిరి సిరి మువ్వలు సీరియల్ లో.. ఉమెన్ లీడ్ రోల్ చేసింది సనా. తను సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేసి.. తన అప్డేట్స్ ని ప్రేక్షకులకు తెలియజేస్తుంది. సీరియల్ యాక్టర్ సమీరాని తన కొడుకుకి ఇచ్చి వివాహం చేసింది సనా.

ఆ తర్వాత ఇద్దరు అత్తాకోడళ్ళు కలిసి తమ యూట్యూబ్ ఛానెల్ లో మహిళలకు ఉపయోగపడే చిట్కాలు చెప్తున్నారు. తను ఇప్పటికే చాలా సినిమాల్లో నటించిన.. కెరీర్ లో ఎక్కడ బ్రేక్ ఇవ్వకుండా ఇప్పటివరకు చిన్న పాత్ర, పెద్ద పాత్ర అని తేడా లేకుండా దాదాపు 200కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది సనా. తాజాగా 'మీ అందరి ప్రేమతో నాకేం అవ్వదు' అనే వ్లాగ్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది సనా. ఇందులో తను గువ్వ గోరింక సీరియల్ షూటింగ్ కోసం రెడీ అవుతున్నట్టుగా చెప్పింది. ఈ సీరియల్ ఒక హెవీ సోన్ చేసిందంట.. అదే ఏడ్చే సీన్ చేసానని సనా అంది. " నా చిన్నప్పుడు మా అమ్మ చేపల కూర తిన్న తర్వాత పెరుగు తినకూడదని చెప్పేది. ఇప్పుడేమో అందరూ వంట చేసేటప్పుడే పెరుగు కలుపుతున్నారు. అసలు చేపతో పెరుగు మనం తినొచ్చా? తినకూడదా ? ఏది కరెక్ట్ తెలిస్తే కామెంట్ చేయండి" అంటూ సనా ఈ వ్లాగ్ లో చెప్పింది.అందరూ తంబ్ నెయిల్ చూసి తనకేమో అయిందని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ వీడియో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.