English | Telugu
కావ్యకి స్వేచ్చనివ్వాలని చెప్పిన సీతారామయ్య!
Updated : Aug 24, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -182 లో.. కావ్య తనేం తప్పు చేయలేదని చెప్పడానికి రాజ్ దగ్గరికి వెళ్ళగానే.. రాజ్ కోపంగా చెయ్యిని గోడకేసి కొడుతాడు. కావ్య రాజ్ దగ్గరికి వెళ్తే రాజ్ రానివ్వడు. మరొక వైపు అపర్ణ గది దగ్గరికి కావ్య వెళ్తుంది. అత్తయ్య లోపలికి రావచ్చా అని అడుగుతుంది. వద్దని అపర్ణ అంటుంది ఎందుకు వచ్చావ్ అని అపర్ణ అడుగుతుంది.
ఆ తర్వాత మీ అవధార్యo కావాలని కావ్య అడుగుతుంది. మీరు పెద్దవారు మీ ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తే చిన్న పిల్లలని క్షమించలేరా అని కావ్య అడుగుతుంది. క్షమించలేను.. ఎందుకు అంటే అసలు నిన్ను ఈ ఇంటి మనిషిగా కూడా చూడట్లేదని, నువ్వు గాలికి కొట్టుకొచ్చిన ఒక ధూళివని అపర్ణ అనగానే.. ఆ ధూళి అయిన కూడా ఎంత పెద్దగాలి వచ్చిన ఒక్కోసారి కదలదని కావ్య కౌంటర్ వేస్తుంది. కావ్య ఇలా అపర్ణకి కౌంటర్ వేయడంతో అపర్ణ ఇంకా కోపం పెంచుకుంటుంది..
ఆ తర్వాత కావ్య దేవుని దగ్గరకి వెళ్లి.. తన బాధని చెప్పుకుంటుంది. కాసేపటికి రాజ్ దగ్గరికి కావ్య వెళ్లి.. మా పుట్టింటి వాళ్లకి సాయం చేస్తానని మాట ఇచ్చాను కదా.. నేను వెళ్ళన అని రాజ్ ని కావ్య అడుగుతుంది. కానీ రాజ్ పట్టించుకోకుండా వెళ్తాడు. కావ్య ఇంట్లో పెద్ద వాళ్ళయిన సీతరామయ్య ఇందిరాదేవిలకి చెప్పి వెళ్దాం అనుకొని హాల్లో కూర్చొని ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి మా పుట్టింటికి వెళ్ళనా అని పర్మిషన్ అడుగుతుంది. మా పెద్దరికం.. ఈ ఇంట్లో మాకు ఎక్కడ ఉంచారని సీతారామయ్య అంటాడు. అపర్ణ వాళ్ళ మాటకి విలువ ఇవ్వలేదని సీతారామయ్య ఇండైరెక్ట్ గా కావ్యతో అంటాడు. ఈ ఇంటి కోడలిని అమానుషంగా బయట నిల్చొపెట్టారని ఇందిరాదేవి అంటుంది. ఆ పని చేసింది నేను కాదు రాజ్ అని అపర్ణ అంటుంది. రాజ్ తనకి నచ్చని పని చేస్తుందని అలా చెయ్యలేదు తన తల్లికి కావ్య ఎదురు చెప్పిందని రాజ్ ఆలా చేసాడు. అయిన నువ్వు రాజ్ ని ఎందుకు ఆపలేదని ఇందిరాదేవి అంటుంది.
ఆ తర్వాత ఒక అమ్మాయికి నచ్చిన పని చేసుకునే స్వేచ్ఛ లేదా? ఎందుకు ఇలా అడ్డు చెప్తున్నారు.. కావ్య వెళ్లడం ఎవరికి ఇష్టం లేదో చెప్పండని సీతరామయ్య అడుగుతాడు. అందరూ మౌనంగా ఉంటారు. మీ మౌనం అంగీకారమని భావిస్తున్నాను.. కావ్య నువ్వు వెళ్ళు ఇక్కడ నిన్ను ఆపే వారు ఎవరు లేరని సీతారామయ్య చెప్తాడు. ఇద్దరు కలిసి కావ్యని తన పుట్టింటికి పంపిస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.