English | Telugu

బిచ్చగాడిలా అనిల్ జీల.. ట్రెండింగ్ లో గంగవ్వ!

అనిల్ జీల.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న పేరు. యూట్యూబర్ గా అనిల్ జీల మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలంగాణాలోని ఒక మారుమూల గ్రామంలో ఉన్న గంగవ్వని పాపులర్ చేసాడు అనిల్ జీల. మై విలేజ్ షో ద్వారా కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ కొంతమందితో కలిసి చిన్న చిన్న వీడియోస్ చేస్తూ గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు పాపులర్ అయ్యాడు. అనిల్ జీల క్రియేట్ చేసిన ఈ 'మై విలేజ్ షో' యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాపులర్ అయిన గంగవ్వకి బిగ్ బాస్ షోలో అవకాశం లభించింది. షోలోకి వెళ్ళాక నాగార్జున సైతం తనకి ప్రోత్సాహం అందించాడు.

యూట్యూబ్ వీడియోల నుండి అనిల్ కెరీర్ మొదలు పెట్టి.. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నాడు. అనిల్ ఎప్పటికప్పుడు విభిన్నంగా ఆలోచిస్తు సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. లాక్ డౌన్ లో అనిల్ పెళ్లి చేసుకుని పెళ్లి పత్రిక డిఫరెంట్ గా చేయించాడు. అప్పట్లో అది కాస్త వైరల్ గా మారింది. రీసెంట్ గా హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ లో నటించి తన కామెడీతో అందరిని మెప్పించాడు. ట్రెండింగ్ లో ఉన్న కంటెంట్ తీసుకొని వీడియోలు తియ్యడం అనిల్ స్టైల్ అనే చెప్పాలి.

గంగవ్వ బిగ్ బాస్ లోకి వెళ్ళినప్పుడు ఎప్పటికప్పుడు ఆమెకి ధైర్యం చెప్తూ బిగ్ బాస్ లో కొనసాగమని చెప్తూ వచ్చాడు అనిల్ జీల‌. గంగవ్వ మాట తీరుకు చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. బిగ్ బాస్ లో ఎంట్రీ తో స్టార్ హీరో, హీరోయిన్ లను కలిసే అవకాశం గంగవ్వ దక్కించుకుంది. గంగవ్వ బిగ్ బాస్ లో ఉండగా నాగార్జున ఆమెకి సొంత ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చి.. తనకి సొంత ఇల్లు కూడా కట్టించాడు. ప్రస్తుతం గంగవ్వ కామెడీ షోస్ లో అప్పుడప్పుడు కనిపించి నవ్విస్తుంది. తాజాగా స్టార్ హీరో రానా దగ్గబాటికి కళ్లు దావత్ అంటూ వీడియోని షేర్ చేశారు. అది కాస్త వైరల్ అయింది. తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వచ్చిన 'సేవ్ ది టైగర్స్' వెబ్ సిరీస్ లో నటించి తన కామెడీతో అందరిని నవ్వించింది గంగవ్వ.

ప్రస్తుతం అనిల్ జీల, గంగవ్వ కలిసి ఒక వీడియోని తమ 'మై విలేజ్ షో' ఛానెల్ లో అప్లోడ్ చేశారు‌. అయితే ఆ వీడియో లో కమెడియన్ బాబు మోహన్ పోషించిన పాత్రలా బిచ్చగాడు గెటప్ వేసుకున్నాడు అనిల్ జీల. తను అచ్చం బాబు మోహన్ లాగా కాస్ట్యూమ్స్ వేసుకొని కామెడీ పండించాడు. దానికి తోడు గంగవ్వ కామెడీ పర్ఫెక్ట్ గా కుదిరింది. దీంతో ఈ వీడియో అత్యంత వీక్షకాధరణ పొందుతుంది. కాగా ఇప్పుడు యూట్యూబ్ లో ఈ వీడియో ట్రెండింగ్ లో ఉంది.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.