English | Telugu

నందుని బ్లాక్ చేసిన మురారి.. కృష్ణకి నిజం తెలిసేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -238లో.. మీ ఫ్యామిలీతో కలిసి మీరు ఎప్పుడు హ్యాపీగానే ఉంటారు. కానీ అందరు ఇంట్లో అవసరం ఉన్నంతవరకు వాడుకొని వెళ్ళిపోయిందని, నన్ను తప్పుగా అనుకుంటారు.. మోసం చేసిందని అనుకుంటారు. అందుకే వాళ్ళతో నిజం చెప్పమని చెప్పాను‌‌.. మీరు చెప్పలేదు.. నన్ను చెప్పనివ్వలేదని మురారితో కృష్ణ చెప్తూ బాధపడుతుంది.

ఒకరిపై ఒకరి ఇష్టాన్ని చెప్పుకోకుండా ఇద్దరు బాధపడుతూనే ఉంటారు. అప్పుడే కృష్ణకి ఒక మెసేజ్ వస్తుంది. అది మురారి ప్రేమ విషయం నందు చెప్తూ చేసిన మెసేజ్.. మురారి కృష్ణ ఫోన్ మెసెజ్ సౌండ్ విని ఇది ఖచ్చితంగా నందూనే చేసి ఉంటుంది. ఎలాగైనా ఆ ఫోన్ కృష్ణ చూడకూడదని మురారి అనుకుంటాడు. అప్పుడే కృష్ణ కార్ ఆపమని వాటర్ బాటిల్ కోసం వెళ్తుంది. వెంటనే మురారి కృష్ణ ఫోన్ తీసుకొని మెసెజ్ డిలీట్ చేసి నందు నెంబర్ బ్లాక్ చేస్తాడు. మరొక వైపు నందు, గౌతమ్ ఇద్దరు కృష్ణ మురారీల గురించి మాట్లాడుకుంటారు. నా మెసేజ్ ఏమైనా చూసిందేమోనని నందు తన ఫోన్ చూస్తుంది. కృష్ణ డీపీ కన్పించకపోయేసరికి నా నంబర్ కృష్ణ బ్లాక్ లో పెట్టెంది. నిజంగానే కృష్ణకి మా అన్నయ్య అంటే ఇష్టం లేదా అని గౌతమ్ తో నందు అంటుంది.

మరొకవైపు కృష్ణని తీసుకొని క్యాంపు దగ్గరికి మురారి వస్తాడు. ఏసీపీ సర్ నన్ను మర్చిపోతారా అని కృష్ణ అడుగుతుంది. ఎందుకంటే బృందావనం లాంటి ఇల్లు.. ఇంట్లో మనుషులు.. ఎప్పుడు ఇల్లంతా సందడి సందడిగా ఉంటుందని కృష్ణ అంటుంది. అంత గొప్పగా మా ఇంటి గురించి చెప్తున్నావ్.. నువ్వు వదిలి ఎందుకు వచ్చావని మురారి అడుగుతాడు. గుళ్లో ఎప్పుడూ ఉండాలని అనుకోకుడదు కదా అని కృష్ణ అంటుంది. కార్ లో ఉన్నా మిగతా లగేజ్ కూడా తీసుకొని.. లగేజ్ మొత్తం సర్దుకున్న ఇంట్లో వాళ్ళకి డౌట్ వస్తుందని వాళ్ళు చూడకుండా ఇది కార్ లో పెట్టానని కృష్ణ చెప్తుంది. ఇక వెళ్ళండి ఏసీపీ సర్ అని కృష్ణ అనగానే.. మురారి వెళ్తూ ఉంటాడు. ఇద్దరు ఒకరికొకరు వెళ్ళలేక వెళ్తున్నట్లు‌‌.. పదే పదే వెన్నక్కి తిరిగి చూసుకుంటారు. ఇద్దరు విడిపోతున్నందుకు ఎమోషనల్ అవుతారు. మరొకవైపు కృష్ణ తన అభిమానాన్ని తెలుపుతూ భవానికి లెటర్ రాస్తుంది. అది చదివి భవాని హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు కృష్ణ వెళ్లిపోగానే ముకుంద.. మురారితో హ్యాపీగా ఉన్నట్లు ఉహించుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.