English | Telugu

Krishna Mukunda Murari : మీరానే సరోగసి మదర్ అని కృష్ణకు చెప్పేసిన మురారి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్-468 లో.. మీరా కళ్ళు‌ తిరిగి పడిపోవడంతో మొదటగా కృష్ణ చెక్ చేసి..‌ ప్రమాదం ఏం లేదు పెద్దత్తయ్య, నీరసంగా ఉండి కళ్ళు తిరిగి పడిపోయిందని భవానితో కృష్ణ అంటుంది. ఆ తర్వాత అమృత చెక్ చేసి.. నువ్వు చెప్పింది నిజమే కృష్ణ‌.. ఇది జనరల్ వీక్ నెస్ అంతే అని చెప్తుంది. ఇక మీరాని ఏకాంతంగా ఉంచాలని అందరు‌ బయటకు వెళ్తారు.

ఇక కృష్ణ ఒంటరిగా ఒక దగ్గర నిల్చొని.. అమృత మేడమ్ ఎందుకు అలా చెప్పిందని ఆలోచిస్తుంటుంది. ‌ఇక అదేసమయంలో కృష్ణ దగ్గరికి అమృత వస్తుంది. ఏంటి కృష్ణ అలా అబద్ధం చెప్పావని అమృత అనగానే.. మీరెందుకు అలా చెప్పారని కృష్ణ అంటుంది. నువ్వు ఇంట్లోనే ఉంటున్నావ్ కదా.. ఏదో సమస్య ఉందని అలా చెప్పావని అర్థం చేసుకున్నాను.. అందుకే అలా చెప్పానని కృష్ణతో అమృత అంటుంది. థాంక్స్ ఆంటీ భవాని అత్తయ్యకి చెప్పకండి అని కృష్ణ అనగానే‌.‌. చెప్పేదానిని అయితే అప్పుడే చెప్పేదానిని అని అమృత అంటుంది. ఇక పూజ చేసి అమృతకు చీరా, ప్రసాదం ఇచ్చి పంపించేస్తారు. ఆ తర్వాత మీరా తన గదిలో ఉండి ఆలోచిస్తుంటుంది. కృష్ణ అంటే అబద్ధం చెప్పింది మరి ఆ డాక్టర్ అమృత ఎందుకు అబద్ధం చెప్పిందని అనుకుంటూ..‌నేను తల్లిని కాలేదా.. సరోగసి మదర్ కో‌సం చేసిన ప్రాసెస్ సక్సెస్ కాలేదా అని కంగారుపడతుంటుంది. అదే సమయంలో మురారి కూడా తనకి చేసిన సరోగసీ ప్రాసెస్ సక్సెస్ కాలేదా అని అనుకుంటాడు. మీరాను కనుక్కుందామని మురారి మెసెజ్ చేస్తుండగా.. కృష్ణ వచ్చి ఫోన్ లాక్కుంటుంది. జస్ట్ మిస్ లేదంటే గోరం జరిగిపోయేది. తొందరగా ఆదర్శ్, మీరాల పెళ్ళి చేయాలని మురారీతో కృష్ణ అనగానే.. తనే సరోగసి మదర్.. వాళ్ళిద్దరికి పెళ్ళి వద్దని మురారి అనగానే కృష్ణ షాక్ అవుతుంది.

ఎందుకిలా చేశారు.. నాకొక మాట చెప్తే సరిపోయేది కదా అని కృష్ణ అంటుంది. నేను ఆ విషయం చెప్దామనే వచ్చాను కానీ నువ్వు మీరా గురించి అప్పటికే చెడుగా అనుకుంటున్నావ్.. ఇది చెప్తే ఒప్పుకోవని చెప్పలేదు.. సరోగసి మదర్ బయట అంత ఈజీగా దొరకడం లేదని.. ఆరు నెలల సమయం పడుతుంది.. దొరకడం లేదని మురారి అంటాడు. తరువాయి భాగంలో రేవతి, కృష్ణ, మురారీలని భవాని పిలుస్తుంది. ‌ఆదర్శ్, మీరాల పెళ్ళి చేద్దాం.. పంతులు గారిని పిలవమని భవాని అనగానే.. ఒక్కసారిగా వద్దని కృష్ణ అరిచేస్తుంది. ఏంటి ఏదో బాంబు పడ్డట్టు అలా అరిచావేంటని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.