English | Telugu

Krishna Mukunda Murari : సరోగసి మదర్ తనే అని చెప్పేసిన మీరా.. షాక్ లో మురారి !

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -463 లో.. మురారి సరోగసి మదర్ గురించి తెలుసుకోవడానికి తన ఫ్రెండ్ డాక్టర్ పరిమళతో మాట్లాడి ఆమె ఫ్రెండ్‌ని కలుస్తాడు. ఆ డాక్టర్ మురారి కోసం డాక్టర్ వైదేహిని సరోగసి ఫైల్ అడిగి తీసుకు రమ్మంటుంది. మరోవైపు భవాని మధుని పిలిచి కిందున్న మధు రూమ్‌ని ఖాళీ చేసి కృష్ణకి ఇవ్వమని చెప్తుంది. దీంతో సరే అని మధు వెళ్తాడు. ఇంతలో కృష్ణ ఇంటికి వస్తుంది. డాక్టర్ ఏమన్నారని భవాని ప్రశ్నలు వేస్తుంది. అంతా బాగానే ఉందని కృష్ణ చెప్తుంది. ఇక కృష్ణ క్యాబ్‌లో వచ్చిందని తెలుసుకున్న భవాని ఫైర్ అవుతుంది. మురారికి కాల్ చేసి తిడుతుంది. మురారి తల పట్టుకుంటాడు. పెద్దత్తయ్య మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు కదా పుట్టబోయే బిడ్డకు ఏం కాకూడదని ఏదైనా పూజ చేయిద్దామా అని భవానీతో కృష్ణ చెప్పగా.. మంచి మాట చెప్పావ్. రేవతి పంతుల్ని పిలిపించు అని అంటుంది.

ఆదర్శ్‌, ముకుందల గురించి ఆలోచిస్తున్న రజినిని చూసి.. ఈవిడ ఏంటి ఎప్పుడు ఎవరో ఒకరి మీద పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంతలా ఆలోచిస్తూ ఉందంటే ఈమెకు ఏ సమస్య వచ్చిందో.. పిన్ని దేని గురించే తీవ్రంగా ఆలోచిస్తున్నావని కృష్ణ అడుగగా.. నేను ఏం ఆలోచిస్తే ఏంటి ఎవరైనా ఆరుస్తారా తీరుస్తారా నీ పని నువ్వు చూసుకోమ్మా అని రజినీ అంటుంది. పిన్ని నువ్వైనా నేనైనా లొడలొడా వాగుతూ ఉంటేనే ఇంట్లో సందడి.. మనం డల్ అయ్యాం అంటే ఏదో సమస్య వచ్చిందనే అర్థం. ఏమైందో చెప్పండి. నువ్వేదో పెద్దత్తయ్యని పేరు పెట్టి పిలిచావని అలా అన్నాను. కానీ నువ్వే నన్ను సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు. నీ సమస్య చెప్పు పిన్ని అని కృష్ణ అనగానే.. ఏముంటుందమ్మా నా కూతురికి పెళ్లి చేయాలి అదే నా బాధ. నీలాగ నా కూతురు కూడా ఈ ఇంటి కోడలు కావాలి. అప్పుడే ఆదర్శ్‌తో పెళ్లి చేయాల్సింది. వదిన వాళ్లకు కూడా ఇష్టమే. కానీ ఆదర్శ్‌ ఆ ముకుందని పెళ్లి చేసుకున్నాడు. అది పోయాక అయినా నా కూతురుతో పెళ్లి చేద్దామంటే ఆ ఆశ తీరేటట్లు లేదని రజినీ అంటుంది. పెద్దత్తయ్యతో మాట్లాడావ్ కదా పిన్ని. ఆలోచిస్తా అన్నారు కదా అని కృష్ణ అంటుంది. ఆదర్శ్ కి ఇష్టం ఉండాలి కదా, ఆ మీరా రాసుకుని పూసుకుని తిరుగుతుందని రజినీ అంటుంది. మరోవైపు ఆ మదర్ ఎవరు? తెలుగు వారా వేరే స్టేటా బయట వాళ్లనే తెప్పిస్తారు. ఎందుకంటే డెలివరీ అయిన తర్వాత ఎవరనేది తెలీకుండా ఉండటానికి. ఎవరైనా సరే కనిపెట్టి కృష్ణ ముందుకు తీసుకెళ్లాలని మురారి అనుకుంటు ఉండగా.. మురారికి కృష్ణ కాల్ చేస్తుంది. సరోగసీ మదర్ గురించి కాసేపట్లో తెలుస్తుందని మురారి అంటాడు. ఇంతలో మీరా అక్కడికి వస్తుంది. నువ్వేంటి ఇక్కడని మురారి అడుగుతాడు.

కృష్ణని ఒంటరిగా ఇంటికి పంపించి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని మీరా అడుగుతుంది. నీకు అంతా తెలుసు కదా. నీ దగ్గర దాయడానికి ఏముంది. సరోగసీ కోసం వచ్చాం కదా. లక్కీగా మదర్ దొరికింది. అది ఎవరో తెలుసుకోవాలి అని కృష్ణ ఆరాటం. రూల్స్ ఒప్పుకోవని తెలుసు కానీ అది ఎవరో తెలుసుకుందామని నా ఫ్రెండ్ పరిమళకి కాల్ చేస్తే డాక్టర్ మీనాక్షికి చెప్పింది. ఆ మదర్ ఎవరో కాసేపట్లో తెలుస్తుందని మురారి అనగానే.. ఇప్పుడు ఆవిడ ఎవరో తెలుసుకొని ఏం చేస్తారని మీరా అనగా.. తాను ఎవరో తెలుసుకొని ఆవిడని జాగ్రత్తగా చూసుకుందామని కృష్ణ అంటోంది. అసలు మా బిడ్డని తొమ్మిది నెలలు మోయబోయే ఆవిడ మాకు దేవతతో సమానం. తనని మేం దగ్గరుండి జాగ్రత్తగా చూసుకుంటామని అంటాడు. మురారి తల మీద చేయి వేసి.. మీ బిడ్డను మోయబోయే ఆ సరోగసీ మదర్‌ని నేనే మీరా అనగానే.. మురారి షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావ్ ముకుంద. ఇలా పరాయి వాళ్ల బిడ్డను మోయడం అంటే సగం జీవితం కోల్పోవడం నువ్వు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నావని మురారి అనగానే.. చెప్పాను కదా మురారి నీ ప్రేమ కోసమని అని మీరా అంటుంది. ఏంటి మళ్లీ చెప్పు అని మురారి అనగానే.. మీ ఇంట్లో ఆశ్రయం ఇచ్చి నాకు అండగా నిలిచారు. మీ రుణం కొంత అయినా తీర్చుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నాను కాదు అనకండి మురారి గారు. ఎందుకు షాక్ అవుతున్నారు. హ్యాపీగా ఫీలవ్వండి. నా కంటే మీ బిడ్డను బాగా చూసుకునే వారు దొరకరు కదా అని కవర్ చేస్తుంది. మురారికి తానే సరోగసి మదర్ అని చెప్పి ముకుంద చాలా సంతోషిస్తుంది. మరోవైపు కృష్ణ సరోగసీ మదర్ ఎవరా అని తెగ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మురారి కృష్ణకు చెప్పాలి అని కాల్ చేస్తా అనుకొని ఇప్పుడు కాదు అనుకుంటాడు. ఇంతలో ముకుంద మురారిని చూసి తనకి కనీసం ఇంటికి డ్రాప్ చేస్తానని పిలవడం లేదని తెగ ఫీలవుతుంది. ఇంతలో మురారి ముకుందని పిలుస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.