English | Telugu

Karthika Deepam2 : ఇకమీదట దీప భాద్యత కార్తిక్ దే.. ఆ ఇద్దరికి నచ్చలేదుగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '.. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -37 లో....అనసూయని తీసుకొని దీప నర్సింహా దగ్గరికి వస్తుంది. నా కోడలికి అన్యాయం చేస్తావా అంటూ తన కొడుకుని మొదటగా నిలదీస్తుంది‌ అనసూయ. ఆ తర్వాత నరసింహ రెండో భార్య శోభ.. మా నాన్న నీ కొడుకుకి టాక్సీ కొనిచ్చాడు.. నాకు నగలు చేయించింది. అంతే కాకుండా కోటి రూపాయల ఈ ఇల్లు ఇచ్చిందని అనగానే అనసూయకి శోభపై మంచి అభిప్రాయం ఏర్పడుతుంది.

ఆ తర్వాత నర్సింహాపై దీప కోప్పడుతుంది. నువ్వు ఆగవే.. నీ భర్త కోసం నువ్వు ఇక్కడికి వచ్చావ్.. వాడు వెళ్ళమని అనగానే.. వెళ్ళిపోతావా అక్కడే ఉండి నీ కాపురం చక్కద్ధిద్దుకోకుండా? ఎందుకు ఆ కొంపలోకి వెళ్లి చేరావని దీపకే రివర్స్ అవుతుంది అనసూయ. ఆ తర్వాత శోభ, నర్సింహా, అనసూయ ముగ్గురు ఒక్కటై దీపనే తప్పుపడతారు. నేను నా కొడుకు దగ్గరే ఉంటాను.. ఇక్కడ నుండి వెళ్ళిపోమని అనసూయ అనగానే.. దీప షాక్ అవుతుంది. అనసూయని తన వైపుకి తిప్పుకోవాలని శోభ ప్రేమగా మాట్లాడుతుంది. అప్పులన్నీ నేనే చెల్లిస్తానని శోభ అనగానే.. నువ్వు ఇక వెళ్ళిపో మాతో నీకేం సంబంధం లేదంటు దీపని తిట్టి పంపిస్తుంది అనసూయ. ఆ తర్వాత ఇక నేను నా కొడుకే దగ్గరే ఉండొచ్చు.. ఆ దీప ఏమైనా నా సొంత తమ్ముడి కూతురు కాదు కదా.. నేనేందుకు బాధపడాలని అనసూయ అనుకుంటుంది. ఆ తర్వాత శోభ వచ్చి.. అత్తయ్య షాపింగ్ కి వెళదాం.. ఓ నాలుగు చీరలు తీసుకోండి అని అనగానే అనసూయ మురిసిపోతుంది.

మరొకవైపు దీపని ఇక్కడే వారం రోజులు ఉండమని చెప్పిన మాటలు జ్యోత్స్న గుర్తుకుచేసుకుంటుంది. అప్పుడే పారిజాతం వచ్చి ఇలా ఎవరైనా డల్ గా ఉంటారా పార్టీకీ వెళ్ళమని అనగానే శివనారాయణ వస్తాడు. శౌర్యని ఎత్తుకొని కార్తీక్ వస్తుంటే.. జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు కోపంగా చూస్తుంటారు. సుమిత్ర, ధశరత్ లు బయటకు వెళ్తు.. మేమ్ వచ్చేవరకు ఇక్కడే ఉండమని కార్తిక్ కి చెప్తారు. దీప ఎందుకో బాధపడుతుంది తన బాధ్యత నువ్వు తీసుకున్నావ్ కదా.. ఆ బాధేంటో కనుక్కోమని కార్తీక్ కి శివనారాయాణ చెప్తాడు.. ఆ తర్వాత శౌర్యని తీసుకొని కార్తిక్ బయటకు వెళ్తుంటే.. మళ్ళీ జ్యోత్స్న, పారిజాతం ఇద్దరు కోపంగా చూస్తుంటారు. మరొకవైపు అనసూయ అంత తొందరగా చేంజ్ అయినందుకు దీప బాధపడుతుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.


Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.