English | Telugu

Krishna Mukunda Murari : మీరాతో ఆదర్శ్ హోలీ సంబరాలు.. కృష్ణ కనిపెట్టేసిందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-441 లో.. మురారీని ఆదర్శ్ క్షమించాడు కానీ కృష్ణ మాట్లాడినా తనతో మాట్లాడడు. అది గమనించిన కృష్ణ డల్ అవుతుంది. ఇక కాసేపటికి హోలీ కోసం రెడీ అవ్వడానికి వెళ్లిన కృష్ణ.. ఆ సమయంలో కూడా ఆదర్శ్ గురించే ఆందోళన చెందుతుంటుంది. ఇంతలో మురారీ కూడా వైట్ డ్రెస్ వేసుకుని కృష్ణ దగ్గరకు వచ్చి.. ఏం ఆలోచిస్తున్నావ్ అంటూ ఆరా తీస్తాడు. ఆదర్శ్ ఎప్పుడు ఎలా మారతాడో అర్థం కావట్లేదు ఏసీపీ సర్.. మొన్నటి వరకూ మీ విషయంలో కోపంగా ఉన్నాడు కదా.. ఇప్పుడు నా మీద కోపంతో ఉన్నట్లుగా అనిపిస్తోందని అంటుంది. అలా ఏం ఉండదు కృష్ణ. నువ్వు అనవసరంగా ఆలోచించకు.. నేను చెబుతున్నాను కదా.. ఆదర్శ్ నెమ్మదిగా నీ విషయంలో కూడా మారతాడు.. పెద్దగా ఆలోచించకంటూ సర్దిచెప్తాడు.

ఇక అందరు హోలీ ఆడటం కోసం వస్తారు. ఇదే మంచి అవకాశం ఆదర్శ్ బావతో రాసుకుని పూసుకుని తిరిగి, తనని నీ వైపు తిప్పుకోమంటూ సంగీతతో రజినీ చెప్తుంది. ఆదర్శ్, ముకుంద ఇద్దరూ మెట్లు దిగుతుంటే.. ఆదర్శ్ కన్నార్పకుండా మీరానే చూస్తాడు. ఆదర్శ్ ఏంటి నన్ను తినేసేలా చూస్తున్నాడు.. రూపం మార్చుకున్నా నా మీద మోజు పోయినట్లు లేదు.. తొందరగా సంగీతను అంటగట్టెయ్యాలి. లేదంటే మళ్లీ కథ మొదటికి వస్తుందని మీరా తన మనసులో అనుకుంటుంది. బయట అందరు కలిసి హోలీ ఆడుకొని లోపలికి వస్తారు. ఇక లోపలికి వచ్చాక భవానికి కృష్ణ రంగు పూస్తూ సంబరపడుతుంది. మరోవైపు మీరా నీ వల్లే ఈ సంతోషమంతా అని ఆదర్శ్ చెప్తాడు. ఇక ఆదర్శ్, మీరా కలిసి రాసుకు పూసుకొని తిరగడం చూసిన రజినీ కోపంగా చూస్తుంది.

ఇక కృష్ణ గదిలో ఉండగా మురారి వస్తాడు. భర్త తన దగ్గరకు రాగానే.. తన మనసులోని అనుమానాన్ని బయటపెడుతుంది కృష్ణ. తనని ముకుంద అని పిలిచినంత మాత్రాన ముకుంద కాదు కదా కృష్ణ.. పేరు పెట్టుకున్నంత మాత్రాన ముకుంద లక్షణాలు తనలోకి రావడం అసాధ్యం కదా.. నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచించొద్దు. భయపడొద్దని మురారి అంటాడు. కృష్ణ సరే అన్నట్లుగా తలాడిస్తుంది. ఇక ముకుందకు మళ్లీ ఆదర్శ్ కనెక్ట్ కావడంతో.. కథ అడ్డం తిరిగిందనే చెప్పుకోవాలి. రజినీ తన కూతురు సంగీతకి ఆదర్శ్ తో పెళ్ళి చేయాలనుకున్న డ్రీమ్ కి మీరా అడ్డుగా మారిందా? మీరానే ముకుంద అనే విషయాన్ని కృష్ణ కనిపెట్టగలదా.. ఇలాంటి ఆసక్తికర అంశాలతో ఈ సీరియల్ ముందుకు సాగుతోంది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.