English | Telugu

Guppedantha Manasu : ఆ గన్ పేల్చింది రిషీయేనా.. వసుధారని కాపాడింది అతడేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -1046 లో.. వసుధారకి ఒక అజ్ఞాతవ్యక్తి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. మేడమ్ మీరు వసుధార గారే కదా.. కనిపించకుండా పోయిన మీ భర్త రిషి నాకు కనిపించారు మేడమ్ అని అంటాడు. ఆ మాట వినగానే.. వసుధార సంతోషానికి అవధులు ఉండవు. ఔనా.. నిజమా.. ఎక్కడ కనిపించారని అడుగుతుంది. నార్సింగ్ రూట్‌లో ఉన్న ఫంక్షన్ హాల్ దగ్గర కనిపించారు మేడమ్ అని ఆ అజ్ఞాతవ్యక్తి చెప్తాడు. సర్ మీరు ఆయన్ని గమనిస్తూ ఉండండి.. నేను వెంటనే వస్తున్నానంటూ రిషి కోసం వసుధార హడావిడిగా బయలుదేరుతుంది. ఇక కారులో వెళ్తూ వెళ్తూ.. రిషితో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఉప్పొంగిపోతుంది వసుధార. ఇక ఈ ప్రేమపక్షులు విహరించిన ప్రదేశాలను.. ఆ సన్నివేషాలను గుర్తు చేసుకుని వసుధార.. ఎప్పుడెప్పుడు రిషిని కలుస్తానా అని కారులో వేగంగా వెళ్లిపోతుంటుంది.

ఇక ఆ అజ్ఞాతవ్యక్తి వ్యక్తి చెప్పిన ప్రదేశానికి వచ్చిన వసుధార.. సర్ అంటూ అటు ఇటు వెతుకుతుంటుంది. హలో మరదలు పిల్లా అంటూ రాజీవ్ వస్తాడు. బావని చూడగానే వసుధార షాకవుతుంది. ఏంటి మరదలు పిల్లా.. ఎవరి కోసమో.. నీ కళ్లు ఆరాటపడుతున్నట్టు ఉన్నాయి.. ఎవరికోసమే నీ ప్రాణం విలవిల్లాడుతున్నట్టు ఉంది. చెప్పు మరదలు పిల్లా.. ఎవరికోసం వెతుకుతున్నావ్.. రిషి కోసమే కదా అని రాజీవ్ అంటాడు. ఆ మాటతో వసుధార.. ఓరి దుర్మార్గుడా?? నువ్వు ఇక్కడున్నావ్ ఏంటి? నేను ఇక్కడికి వస్తున్నట్టు నీకు ఎలా తెలుసని అడుగుతుంది. నీకు ఫోన్ చేసిందే నేను. వాడు కనిపించాడని అనగానే చాలా సంతోషపడ్డట్టున్నావ్.. చాలా హ్యాపీగా వాడి కోసం వచ్చావ్ కదా.. కానీ వాడు ఇక్కడ లేడు.. ఇక్కడే కాదు.. అసలు ఎక్కడా లేడని రాజీవ్ అంటా. రిషి సర్ పేరు చెప్పి నన్ను ఎందుకు పిలిపించావ్? ఛీ అసలు నువ్వు మనిషివేనా?? ఒక ఆడపిల్లని ఇలా ఇబ్బంది పెట్టకూడదని నీకు తెలియదా? ఎన్నిసార్లు చెప్పాలి.. నువ్వు నా దగ్గర ఈ మాట ఎత్తొద్దు.. నువ్వు నా కంట పడొద్దని చెప్పాను కదా.. నీకు బుద్దిలేదా? బుర్ర పనిచేయడం లేదా? పిచ్చి పట్టిందా? అని రాజీవ్ పై వసుధార రెచ్చిపోతుంది. అవును పిల్లా.. నాకు బుద్ది లేదు.. నా మైండ్ దొబ్బింది.. నువ్వులా ఒంటరిగా ఉంటే నాకు పిచ్చిపట్టేట్టు ఉంది. నీపై ఉన్న ప్రేమతో నాకు పిచ్చి పట్టింది.. ఈ తాళిని మెడలో కట్టి నా పిచ్చిని తగ్గించుకుంటానని రాజీవ్ అంటాడు. ఇక దానికి వసుధార స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది.

ఇక వసుధారని రాజీవ్ లాక్కెళ్తుంటే అప్పుడే గన్ పేలిన శబ్దం వినిపిస్తుంది. ఎవరని వసుధార, రాజీవ్ చూస్తుంటే మను వస్తాడు. ఇక అతడిని చూసిన రాజీవ్ కోపంతో ఊగిపోతాడు. ఏంది భయ్యా ఇది.. గన్‌లు చూపించడాలు.. కాల్చడాలు.. నేను ఎప్పుడూ నా మరదలి వెంటపడినా.. మధ్యలో వస్తావేంటి? ప్రతిసారీ వచ్చి తనని కాపాడటానికి నువ్వేమైనా అవతార పురుషుడివా?ఆపద్భాందువుడివా అని రాజీవ్ అంటాడు. ఓ అమ్మాయి మనసు తెలిసినవాడ్ని అని మను అంటాడు. నీకు లాస్ట్ టైమ్ కూడా చెప్పాను కదా.. ప్రేమతో అమ్మాయిని మనసు గెలుచుకోవాలి కానీ.. ఇలా భయపెట్టి.. బెదిరించి అమ్మాయిని లొంగదీసుకోవాలనుకోవడం మగాడి లక్షణం కాదని మను అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.