English | Telugu

Guppedantha Manasu : కన్నకొడుకుతో ఏ తల్లి ఇలా చేయదన్న మహేంద్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' గుప్పెడంత మనసు '. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్-1031 లో.. అనుపమ ఆసుపత్రి పాలవ్వడం.. అంతకు ముందు రిషీపై దాడి.. జగతిపై ఎటాక్. ఈ కుట్రలన్నింటికి సూత్రధారి ఎవరో ఉన్నారు.. మన కాలేజీని దక్కిచుంకోవడానికి ఇవన్నీ చేస్తున్నారంటూ దేవాయనితో ఫణీంద్ర శైలేంద్ర ముందే అంటాడు. దాంతో వాళ్లిద్దరు ఆందోళన చెందుతారు. ఇది బయట వాళ్ళు చేస్తున్నారా.. వాళ్ళెవరో నువ్వే కనిపెట్టాలి శైలేంద్ర.. అప్పుడు చెప్తా వాళ్ళ పని అని ఫణీంద్ర అంటాడు. దాంతో హా సరే డాడీ అని శేలేంద్ర అంటాడు.

ఏం సరేనో ఏమో.. నువ్వు కాలేజీలో చేసేదేమి లేదు. పోనీ రిషి జాడ కనుక్కోమంటే అది చేయలేదు. కనీసం ఇదైనా సరిగ్గా చెయ్యి.. మన శత్రువులు ఎవరో నువ్వే పట్టుకొని నాకు అప్పగ్గించాలి అర్థమైందా అని చెప్పి ఫణీంద్ర అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఇంతలో మను దగ్గరికి ఏంజిల్, వసుధారలు వస్తారు. మను తినడానికి స్నాక్స్ ఇస్తారు. నాకు తినాలని లేదు.. ఆకలిగా లేదని మను అంటాడు. మనసు బాలేదా అని వసుధార అనగా.. ఆకలిగా లేదని మను అంటాడు. ఇక ఏంజిల్ .. తిను మను అని అంటుంది. నాకు అలవాటైపోయిందని మను అంటాడు. ఇక ఏంజిల్ అయితే మనుని కూర్చోబెట్టి తినమని గట్టిగా అంటుంది. మను ఆలోచిస్తుంటాడు. ఏంటి తినే ఓపిక లేదా లేదంటే నిను తినిపిస్తానని ఏంజిల్ అంటుంది. దాంతో వద్దులే అని మను తింటాడు. అది చూసిన వసుధార, ఏంజిల్ సంతోషపడతారు. ఇక మను తింటుంటే పొలమారుతుంది. దాంతో ఏంజిల్ తలనిమురుతూ... వాటర్ బాటిల్ మరిచిపోయా అని అంటుంది. నువ్వు ఇక్కడే ఉండ నేను వెళ్ళి తీసుకొస్తానని వసుధార వెళ్తుంది. ఇంతలోనే ఏంజిల్ తీసుకొచ్చి.. మనుకి తాగిస్తుంటుంది. ఇక డాక్టర్ వచ్చి అనుపమ కండిషన్ చూసి నార్మల్ గా ఉందని రేపు డిశ్చార్జ్ చేస్తామని చెప్తారు. అనుపమని మా ఇంటికి తీసుకుపోతానని ఏంజిల్ అంటుంది. లేదు.. అనుపమని మా ఇంటికి తీసుకెళ్తానని మహేంద్ర అంటాడు. నువ్వైనా చెప్పు వసుధార అని ఏంజిల్ అంటుంది. మను గారికి అమ్మ అనుపమ.. మను గారు ఏమంటే అదే అని వసుధార అంటుంది.

మను గారు ఏమంటారని ఏంజిల్ అడుగుతుంది. నా నిర్ణయం ఏముంది.. ఆవిడ ఇష్టమని మను అంటాడు. అమ్మ ఏంజిల్ నువ్వు మా ఇంట్లో ఉండని మహేంద్ర చెప్తాడు. దాంతో అనుపమని, ఏంజిల్ ని మహేంద్ర ఇంటికి తీసుకొని వస్తాడు. కారు దిగపోతుంటే అనుపమ పడిపోతుండగా.. మను భుజం పట్టుకొని చూస్తాడు. అనుపమ జాగ్రత్త అని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత మను ట్యాబ్లెట్ తీసుకొచ్చి అనుపమకి ఇస్తాడు. ఏదైన అవసరమైతే కాల్ చేయండని మను అనగానే.. అవసరం రాదని అనుపమ అంటుంది. దాంతో మను వెళ్ళిపోతాడు. ఇక మహేంద్ర వచ్చి.. మను వెళ్ళిపోయాడా అని అడుగుతాడు. వెళ్తానన్నాడు వెళ్ళాడని అనుపమ అనగానే.. అలా పంపిచేస్తావా.. కుటుంబమన్నాక గొడవలు కామన్. అలా అనీ కన్నకొడుకుతో ఏ తల్లి ఇలా చేయదని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.

Illu illalu pillalu : అమూల్యకి పెళ్ళిచూపులు.. కామాక్షి ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -362 లో.. పెళ్లిచూపులకి ఇంకా రావడం లేదని రామరాజు వాళ్ళు ఎదురుచూస్తుంటే వాళ్ళు రారుగా అని శ్రీవల్లి మనసులో అనుకుంటుంది. అప్పుడే అబ్బాయి వాళ్ళు పెళ్లిచూపులకు ఎంట్రీ ఇస్తారు‌. దాంతో శ్రీవల్లి షాక్ అవుతుంది. భాగ్యం, ఆనందరావు కూడా వస్తారు. వాళ్ళు ఏం జరిగిందో శ్రీవల్లికి చెప్తారు. వాళ్ళు చెప్పాల్సింది మొత్తం అబ్బాయి వాళ్ల నాన్నకి చెప్తారు కానీ అతనికి చెవులు వినిపించవు.. వాళ్ల అమ్మ కి చెప్పేలోపు అటువైపు గా ప్రేమ, ధీరజ్ వెళ్లడం చూసి మళ్ళీ చెప్పలేకపోయామని శ్రీవల్లికి భాగ్యం చెప్తుంది.