English | Telugu
కృష్ణని ఇంట్లో నుండి గెంటేసిన భవాని.. ఆ లెటర్ లో ఏం ఉంది?
Updated : Oct 16, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -289 లో.. కృష్ణ చేసిన మోసం గురించి ముకుంద చెప్తుంది. అలాగే మురారిని ప్రేమించాను. తప్పని పరిస్థితిలో ఆదర్శ్ ని పెళ్లి చేసుకున్నాను. అది కూడా మురారి చేసుకోమని చెప్తేనే చేసుకున్నానని ముకుంద చెప్తుంది.. అదంతా వింటున్న భవాని గుండెపగిలినంత పని అయింది.
ఆ తర్వాత పెద్ద అత్తయ్య అంటూ ముకుంద ఏదో చెప్పబోతు ఉంటే.. షటప్ నువ్వు మాట్లాడకు అంటూ కృష్ణని మాట్లాడే ఛాన్స్ భవాని ఇవ్వదు. ఆ తర్వాత రేవతి భవానికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రేవతి పైకి గట్టిగా అరుస్తుంది భవాని. నా కళ్లముందు ఈ కృష్ణ తిరగడానికి వీలు లేదు. అలేఖ్య నువ్వు వెళ్లి తన లగేజ్ తీసుకొని రా అనగానే అలేఖ్య తీసుకొని వస్తుంది.
ఇప్పటికిప్పుడు ఇక్కడ నుండి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తుందని ప్రసాద్ అంటాడు. పాపం కృష్ణ.. చాలా మంచిది పెద్దమ్మ అని మధు అంటాడు. రేవతి కూడా అలాగే మాట్లాడుతుంది. కానీ భవాని మాత్రo ఎవరి మాట వినదు.. ఆ తర్వాత మురారి తప్పేం లేదని కృష్ణ చెప్పి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. తను ఇంట్లో ఉన్నప్పటికీ జ్ఞాపకాలు గుర్తుకు చేసుకుంటుంది కృష్ణ. ఆ తర్వాత భవాని బాధపడుతుంది. మరొక వైపు ఇన్ని రోజులు దాచుకున్న నిజం చెప్పేసాను. ఇక మురారి వచ్చాక మురారికి నాకు పెద్ద అత్తయ్య పెళ్లి చేస్తుందని ముకుంద అనుకుంటుంది.
ఆ తర్వాత ముకుంద దగ్గరకి మధు వస్తాడు.. అనవసరంగా అమాయకురాలి జీవితంతో ఆడుకున్నావని అంటాడు. ముకుంద పొగరుగా సమాధానం చెప్తుంది. అప్పుడే భవాని వచ్చి.. మళ్ళీ కృష్ణని అమాయకురాలని అంటున్నావని మధు పై కోప్పడుతుంది. దీని అంతటికి కారణం మురారి.. ముగ్గురు జీవితలు నాశనం చేశాడని భవాని అంటుంది. మరొక వైపు కృష్ణ హాస్పిటల్ కీ వెళ్తుంది. అప్పుడే కృష్ణకి ఒక లెటర్ వస్తుంది. అది మురారి రాసింది. అందులో ముకుంద గురించి తను కృష్ణని ప్రేమిస్తున్నట్లు ఉంటుంది. అది చదివి కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.