English | Telugu

మన ప్రేమ గతం.. నా భార్యకి అన్యాయం చేయలేను!


'కృష్ణ ముకుంద మురారి' స్టార్ మా టీవీలో వస్తున్న ధారావాహిక. అత్యంత ప్రేక్షకాదరణ పొందుతోన్న ఈ సీరియల్ ప్రేమ, పంతం మధ్య సాగుతుంది. కాగా ఈ సీరియల్ ఎపిసోడ్-57 లోకి అడుగుపెట్టింది.

అందరూ షాపింగ్ నుండి ఇంటికి వస్తారు. ముకుంద ఇంటికి రాగానే కాలు బెణికినట్లు నటిస్తుంటుంది. అది చూసి మురారి "ఇప్పుడు కాలు ఎలా ఉంది" అని అడగడంతో.. ముకుంద కోపంగా "ఏంటి అంత దూరం ఉండి అడుగుతున్నావు. అదే మీ ఆవిడ కాలు బెణికితే ఎత్తుకొని తీసుకెళ్తావు. అసలు నన్ను పట్టించుకోనట్టు చూస్తున్నావ్" అని అంటుంది. "నాకు పెళ్లి అయింది. నీకు పెళ్లి అయింది. మన ప్రేమ అనేది ఒక గతం మాత్రమే. ఇప్పుడు నా భార్య కృష్ణ. తనకి అన్యాయం చెయ్యలేను. నీకు భర్త ఆదర్శ్ ఉన్నాడు. ఇక నా గురించి కలలు కనడం మానుకో" అని చెప్పి మురారి అక్కడ నుండి వెళ్ళిపోతాడు.

కృష్ణ దగ్గరికి మురారి వస్తాడు. తను షాపింగ్ లో తీసుకున్న చీర కింద పడి ఉండడంతో " ఏంటి చీర కింద పడి ఉంది" మురారి అడుగుతాడు. "ఒకరు దానిపై ఆశపడ్డాక.. నాకు అది అవసరం లేదు. ఏదో పట్టుదలతో ఆ చీర కావాలని ముకుందతో ఆర్గ్యుమెంట్ చేశాను. కానీ నాకు అది అవసరం లేదు" అని కృష్ణ అనడంతో మురారి ఆలోచనలో పడతాడు. "చీర మీద ఆశ పడితేనే వద్దని పడేసింది. అదే ముకుంద నా మీద ఆశ పడుతుంది అని తెలిస్తే నన్ను కూడా వదిలేస్తుందా" అని మనసులో అనుకుంటాడు. "కృష్ణ నువ్వు పండగకి ఏ చీర కట్టుకుంటావ్.. పెద్దమ్మ ఆ చీర కట్టుకోలేదని అడిగితే ఏం చేస్తావ్.. ఈ కలర్ అంటే మీ నాన్న కి బాగా ఇష్టం" అని మురారి అనడంతో తను చీర కట్టుకునేందుకు ఒప్పుకుంటుంది.

అందరూ భోగి మంటలు ఎంజాయ్ చేస్తుంటే ముకుంద మాత్రం ఒంటరిగా ఉంటుంది. కృష్ణ, మురారీలు అన్యోన్యంగా ఉండడం చూసి తట్టుకోలేకపోతుంది ముకుంద. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు.