English | Telugu
Krishna Mukundha Murari: కృష్ణ కోసం కాఫీ చేసిన మురారి.. మాడ్చుకున్న ముకుంద!
Updated : Nov 7, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -308 లో.. భవాని దగ్గరకు మురారి వచ్చి.. మీరెందుకు వేణి డాక్టర్ ని దూరం పెడుతున్నారు. లేదని మాత్రం చెప్పకండని మురారి అడుగుతాడు. లేదని చెప్పను. అవునని దూరం పెట్టామని భవాని అంటుంది.
ఆ తర్వాత ఎందుకు దూరం పెట్టానో చెప్తాను కానీ నువ్వు వెళ్లి మళ్ళీ తనని అడగవద్దని భవాని అనగానే.. మురారి సరేనంటాడు. తనని డాక్టర్ చదివించింది మనమే కానీ ఆ కృతజ్ఞత వాళ్ళు చూపించలేదు. మన కుటుంబాన్ని దారుణంగా మోసం చేశారు. అంతేకాకుండా ఒక రకంగా చెప్పాలంటే నీకు ఈ సిచువేషన్ రావడానికి కూడా కారణం వాళ్ళేనని భవాని చెప్తుంది. ఇక నువ్వు ఎక్కువగా ఆ అమ్మాయితో ఉండకు నేను చెప్పినట్టు వింటావా అని భవాని అనగానే మురారి వింటానని అంటాడు.
దాంతో భవాని హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరుసటి రోజు ఉదయం కృష్ణ నిద్ర నుండి లేచి బయటకు రాగానే మురారి ఉంటాడు. మీకు కాఫీ తీసుకొని వస్తాను అని చెప్పి కృష్ణ లోపలికి వెళ్తుంది. అప్పుడే గ్యాస్ అయిపోతుంది. మురారి కిచెన్ లోకి వచ్చి మిమ్మల్ని వేణి అనే కంటే కృష్ణ అని పిలవాలని ఉంది. మీకు ఒకే నా అని మురారి అడుగుతాడు. ఒకే అని కృష్ణ చెప్తుంది.ఇద్దరం కాఫీ తాగాలి కాబట్టి మనం మా ఇంట్లోకి వెళ్లి తాగుదామని కృష్ణ చెయ్యి పట్టుకొని మురారి తీసుకొని వెళ్తాడు. మరొక వైపు మురారి ఎక్కడ కన్పించకపోవడంతో ముకుంద టెన్షన్ పడుతుంది. అప్పుడే కృష్ణ, మురారి ఇద్దరు వస్తుంటే రేవతి, మధు చూసి సంతోషపడతారు. ముకుంద మాత్రం కోపంగా చూస్తుంది. ఆ తర్వాత కృష్ణకి కాఫీ చేసుకొని వస్తాడు మురారి.
ఆ తర్వాత మురారి తన గదిని చూపిస్తానంటూ కృష్ణని పైకి తీసుకొని వెళ్తాడు. ఒక్కపుడు కృష్ణ మురారి ఇద్దరు ఉన్న గదికి కాకుండా ఇప్పుడు ముకుంద ఉన్న గదిలోకి తీసుకొని వెళ్తాడు. అది చూసి.. నేనేంటి ముకుంద గదికి తీసుకొని వచ్చానని మురారి అనుకుంటాడు. ఈ రూమ్ నచ్చింది ముకుంద. నువ్వు వేరే రూమ్ కీ షిఫ్ట్ అవ్వు అని మురారి చెప్తాడు. ఆ తర్వాత మనం షాపింగ్ కీ వెళ్దామని అన్నావ్ కాదా అని మురారితో ముకుంద అంటుంది. అవును నువ్వు కూడా రావచ్చు కాదా కృష్ణ అని మురారి అనగానే.. కృష్ణ ఇబ్బంది పడుతుంటే రేవతి మధు ఇద్దరు వచ్చి వెళ్ళమని చెప్తారు. అప్పుడు కృష్ణ సరే అంటుంది. ఆ తర్వాత కృష్ణ దగ్గరికి రేవతి వస్తుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలాగే ఏసీపీ సర్ నాకు దగ్గర అవుతారని రేవతితో కృష్ణ అంటుండగా అప్పుడే ముకుంద వచ్చి.. అది జరగదని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.