Read more!

English | Telugu

భవానికి ఎదురుతిరిగిన కృష్ణ.. అసలేం జరిగిందంటే!

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ 101 లో.. మురారికి కృష్ణ పానీపూరి తినిపిస్తుండగా.. ముకుంద వచ్చి ఆపుతుంది. "నువ్వు ఏంటిక్కడ?" అని కృష్ణ అడిగితే, పని మీద వచ్చానని చెప్తుంది. కొద్దిసేపు మాట్లాడుకొని కృష్ణ, మురారిలు ఒక కార్ లో, ముకుంద వేరే కార్ లో వెళ్తారు. అందరూ ఒకేసారి ఇంటికి చేరుకొని ఇంట్లోకి వెళ్తారు. వాళ్ళు రావడం చూసిన భవాని "ముగ్గురు కలిసే వస్తున్నారా?" అని అడుగుతుంది. "లేదు పెద్దత్తయ్య.. వాళ్ళు ఇద్దరు కాలేజీ నుండి వస్తున్నారు. నేను బొటిక్ నుండి వస్తున్నాను" అని ముకుంద చెప్తుంది.

ఆ తర్వాత భవాని అక్కడ నుండి వెళ్తుంటే కృష్ణ ఆగమని చెప్తుంది. "మీతో మాట్లాడాలి అత్తయ్య" అని కృష్ణ అనగానే.. "ఏం మాట్లాడాలి.. మళ్ళీ ఏం విప్లవం స్పష్టించబోతున్నావ్?" అని భవాని అడుగుతుంది. "లేదత్తయ్యా.. మా సీనియర్ డాక్టర్ తో నందినికి మందులు రాపించుకొని తీసుకొని వచ్చాను.. ఇక నుండి అవే వాడదాం" అని కృష్ణ అంటుంది.‌ 

"నువ్వు జూనియర్ డాక్టర్ వి.. అలా వెళ్ళి రెండు రోజులు కాలేదు.. అంతా తెలిసినట్లు మాట్లాడుతున్నావ్?" అని ముకుంద అనగానే.. "నేను పెద్ద అత్తయ్యతో మాట్లాడుతున్నాను. నువ్వు కలుగజేసుకోకు" అని కృష్ణ అంటుంది. "ఆ టాబ్లెట్స్ స్లో పాయిజన్ ఎక్కించినట్లుగా ఉంటుంది.. అందుకే నందు భయపడుతుంది" అని కృష్ణ అంటుంది. 

దానికి సమాధానంగా.. "మేము పెద్ద సూపర్ స్పెషలిటీ సీనియర్ డాక్టర్ ని అడిగి.. ఆ మందులు వాడుతున్నాం" అని భవాని అంటుంది. అయినా సరే వినకుండా తను తెచ్చిన టాబ్లెట్స్ వాడతానని కృష్ణ గట్టిగా వాదిస్తుంది. ఇక ముకుంద కలుగచేసుకొని.. "పెద్దత్తయ్య నిన్ను ఇంట్లోకి రానివ్వడమే తప్పయింది.. నిన్న కాక మొన్న వచ్చి  పెద్దత్తయ్య మాటకే ఎదురు చెప్తున్నావ్" అని ముకుంద అంటుంది. 

"నేను నిన్న కాక మొన్న వస్తే.. నువ్వు పుట్టగానే ఏం రాలేదు కదా. నాకంటే నాలుగు రోజుల ముందు వచ్చావ్" అని కృష్ణ అంటుంది. ఇక మధ్యలో మురారి కలుగజేసుకొని.. "నీకు ఆదర్శ్ తాళి కడితే నువ్వు ఈ ఇంటికి ఎలా వచ్చావో.. నేను తాళి కడితే కృష్ణ నా భార్యగా ఈ ఇంటికి అలాగే వచ్చింది" అని అంటాడు.

"టాబ్లెట్స్ వేసుకోనని మీ అమ్మతో చెప్పు నందు" అని కృష్ణ అంటుంది. ఆ తర్వాత నందు భవాని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. "నేను ఆ టాబ్లెట్స్ వేసుకోను అమ్మా" అని పిలిచేసరికి ఎమోషనల్ అవుతుంది భవాని. "ఇక నందు బాధ్యతలు అన్నీ ముకుంద నువ్వే చూసుకో.. కృష్ణ నువ్వు పట్టించుకోకు" అని భవాని చెప్పడంతో.. సరేనని కృష్ణ అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.