English | Telugu

అది లేకుండా నేను అస్సలు ఉండలేను..!

దీప్తి సునైనా కొన్నాళ్ల నుంచి ఒంటరిగా ఉంటోంది. ఆమె తన లవర్ షణ్ముఖ్ జస్వంత్ కి గుడ్ బై చెప్పిన విషయం మనకు తెలుసు. బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న షణ్ముఖ్ సిరి హన్మంత్ తో రొమాన్స్ చేయడం నచ్చక దీప్తి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చింది. షణ్ముఖ్-సిరి హద్దులు దాటి వ్యవహరించడాన్ని బయట నుండి గమనించిన దీప్తి హర్ట్ అయ్యింది. ఆ తర్వాత షణ్ముఖ్ ని వదిలేస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా ఫాన్స్ కి చెప్పింది. షణ్ముఖ్ తో నాకున్న లాంగ్ రిలేషన్ షిప్ కి బ్రేక్. మేమిద్దరం విడిపోతున్నామని ఒక పోస్ట్ పెట్టింది. ఇక ఎవరి దారిలో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వెబ్ సిరీస్, కవర్ పేజీ సాంగ్స్ చేసుకుంటూ బిజీ ఇపోయారు.

దీప్తి అప్పుడప్పుడు అందాల విందు చేస్తూ సోషల్ మీడియాలో తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకోవడానికి తెగ ట్రై చేస్తూ పోస్టులు పెడుతుంది. షన్నుతో కలిసిపోవాలి అని ఎంత మంది ఫాన్స్ అడిగినా కూడా ఆ మాట దాటేస్తూ వచ్చింది. అప్పుడప్పుడు తన ఫాన్స్ తో ఇన్స్టాగ్రామ్ ముచ్చట్లు పెడుతుంది. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు కొంటె ఆన్సర్స్ కూడా ఇస్తూ ఉంటుంది.

రీసెంట్ గా ఒక నెటిజన్ "కీరా అంటే ఎందుకు ఇష్టం (డోంట్ స్కిప్)" అని అడిగేసరికి "నేను అది లేకుండా అది నేను లేకుండా ఉండలేము" అని కొంటె ఆన్సర్ ఇచ్చింది. "కార్ నీదేనా దీపు" అని అడిగేసరికి " లేదు..నాకు కార్ లేదు.. నేను క్యాబ్ లో వెళ్తుంటాను" అని చెప్పింది. దీప్తి బిగ్ బాస్ తెలుగు సీజన్ టులో కనిపించింది. అందులో హీరో తనీష్‌తో కలిసి రచ్చ చేసింది. దీంతో అప్పట్లో ఆమె మీద చాలా ట్రోల్స్ వచ్చాయి. ఇక ఈమె 'ఏమోనే' అనే క్యూట్ సాంగ్‌ కూడా చేసింది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.