English | Telugu
తల్లి కాబోతున్న కాంచన..వేదపై ఫైర్ అయిన మాలిని!
Updated : Aug 9, 2022
నిరంజన్, డెబ్జాని మోడక్ జంటగా నటించిన సీరియల్ `ఎన్నెన్నో జన్మల బంధం`. బుల్లితెర రొమాంటిక్ ఎంటర్ లైనర్ ప్రసారం అవుతూ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. బెంగళూరు పద్మ. సులోచన, జీడిగుంట శ్రీధర్, ప్రణయ్ హనుమండ్ల, ఆనంద్, వరదరాజులు, మిన్ను నైనిక తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. మాలిని, కాంచన, రత్నం బయటికి నుంచి ఇంటికి వచ్చే సరికి వేద, యష్ కర్టెంన్ ల మధ్య చిక్కుకుని కిందపడిపోయి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ వుంటారు. ఈ క్రమంలో యష్ చేతిక గాయం అవుతుంది.
అది గమనించిన మాలిని .. వేదపై మండిపడుతుంది. అయితే యష్ మాత్రం హ్యాపీగా ఫీలవుతూ వుంటాడు. వేద తన చేతికి కట్టుకడుడూ యష్ ని తిట్టేస్తుంది. దీంతో నీ కోసంలోనే నాకు ఆనందం వుందని అంటాడు యష్. అయితే వేద భుజానికి కూడా దెబ్బతగలడంతో ఏమైందని యష్ అడుగుతాడు. కానీ వేద మాత్రం చెప్పదు. భుజంపై గాయం అయిందని తెలుసుకున్న యష్ .. వేద భుజానికి మందు రాస్తాడు. ఇదిలా వుంటే కాంచన కైలాష్ ని కలవడానికి వెళుతుంది. తను గర్భవతిని అని చెబుతుంది. మీకు ఏమైనా అయితే మన బిడ్డ అన్యాయం అయిపోతుంది అంటుంది.
వెంటనే కైలాష్ ఏంటీ బిడ్డా? అంటాడు. ఆ విషయం చెప్పడానికే ఇక్కడికి వచ్చానంటుంది. కట్ చేస్తే.. కాంచన ఇంటికి వెళ్లగానే అంతా నవ్వుల్లో మునిగిపోయి వుంటారు. తనని చూసి ఏంటీ కాంచన ఎక్కడికి వెళ్లి వస్తున్నావ్ అని రత్నం అడుగుతాడు. అయితే నేనేమైనా చిన్నపిల్లనా? అంటూ సమాధానం చెబుతుంది కాంచన. అయితే సరే రత్నం మళ్లీ అడుగుతాడు. దాంతో మా ఆయనని కలవడానికి వెళ్లానని చెబుతుంది. ఇదిలా వుంటే మాళవిక స్వీట్ బాక్స్ పట్టుకుని యష్ ఇంటికి వెళుతుంది. మళ్లీ ఏం గొడవ చేయడానికి వచ్చావని మాలిని అడుగుతుంది. మాళివిక అన్నమాటలతో యష్ ఇంట్లో కొత్త రగత మొదలవుతుంది.