Read more!

English | Telugu

రాహుల్ బాగోతం రాజ్ కి తెలిసిపోయిందా?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -107 లో...రాహుల్, వెన్నెల ఎంగేజ్ మెంట్ కి ముహూర్తం చూడడానికి దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్ళు పంతులు గారిని పిలిపిస్తారు. అతను ఇద్దరు జాతకాలు చూసి రేపు సాయంత్రం ముహూర్తం ఉందని చెప్తాడు. సరే అని రుద్రాణి అరుంధతికి ఫోన్ చేసి.. రేపు ఎంగేజ్ మెంట్ కి మీరు త్వరగా వచ్చేయ్యండని చెప్తుంది. మరొక వైపు స్వప్నకి పెళ్లి కాయం చేస్తునట్లు కావ్యకి ఫోన్ చేసి చెప్తుంది అప్పు. రాహుల్ తో పెళ్లి జరిపిస్తానని అన్నావ్ కదా అక్క అని అప్పు కావ్యని అడుగుతుంది. అమ్మ ఏం చేసినా మన మంచికే చేస్తుంది. అడ్డు చెప్పకని కావ్య అంటుంది. ఏంటి అక్క రాహుల్ తో  స్వప్నక్క పెళ్లి చెయ్యాలని  నువ్వు ఎంత ఇబ్బంది పడ్డావ్.. ఇప్పుడు ఇలా అంటున్నావ్ ఏంటని అప్పు అంటుంది. నేను అన్ని తర్వాత చెప్తానని చెప్పి కావ్య ఫోన్ కట్ చేస్తుంది.

కావ్య ఫోన్ మాట్లాడి వస్తుంటే.. రాహుల్ ఎదురుపడతాడు. స్వప్న పెళ్లిని, ఇటు నా ఎంగేజ్ మెంట్ ని నువ్వు ఆపలేవని రాహుల్ పొగరుగా అనేసరికి.. రాహుల్ చీట్ చేసిన అమ్మాయిల లిస్ట్ అంతా కావ్య చెప్తుంటే రాహుల్ లో భయం మొదలవుతుంది. ఇప్పటివరకు ఈ గేమ్ లో నువ్వు గెలిచావ్.. ఒప్పుకుంటాను కానీ విన్నింగ్ ఫైనల్ షాట్ మాత్రం నాదే అంటూ కావ్య కాన్ఫిడెంట్ గా చెప్తుంది. నీ బాగోతం రాజ్ కి, ఇంట్లో వాళ్ళకి ఎలా తెలిసేలా చేస్తాను చూడు అని కావ్య అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అసలు కావ్య ఏం చెయ్యబోతుందని టెన్షన్ పడతాడు రాహుల్. మరొకవైపు రాజ్ ని కలవడానికి మేనేజర్ ఇంటికి వస్తాడు. రాహుల్ ఎంప్లాయిస్ కి ఇస్తానన్న బోనస్ రాహుల్ తీసుకున్నాడు. దాంతో ఎంప్లాయిస్ స్ట్రైక్ చేస్తున్నారు.. ప్రొడక్షన్ మొత్తం ఆగిపోయిందని రాజ్ కి చెప్తాడు మేనేజర్. రాజ్ ఒక్కసారి షాక్ అయి ఈ విషయం ఇన్ని రోజుల నుండి నాకు ఎందుకు చెప్పలేదని రాజ్ అంటాడు. రాహుల్ మీకు అంత తెలుసని అన్నాడు సర్ అని మేనేజర్ అంటాడు. ఇప్పటికైనా రాహుల్ మీరు అనుకునే రాహుల్ కాదని అర్థం అయిందా అని కావ్య అంటుంది. రాహుల్ ని అడుగుదామని రాజ్ లోపలికి వెళ్లేసరికి రాహుల్ ఎంగేజ్ మెంట్ డ్రెస్ సెలక్ట్ చేస్తుంటాడు. అందరూ సంతోషంగా ఉండడంతో డిస్టర్బ్ చెయ్యడం ఎందుకని రాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

మరొకవైపు రిపోర్టర్ శృతి కాల్ చేసి.. రాహుల్ నన్ను చీట్ చేసాడని ఆధారాలు కావాలంటే మనం ఒక ప్లేస్ కి వెళ్ళాలి రండని కావ్య, కళ్యాణ్ లకు ఆ అమ్మాయి చెప్తుంది. ఆ తర్వాత కావ్య కాఫీ తీసుకొని రాజ్ దగ్గరికి వస్తుంది. రేపటితో నీకు ఇచ్చిన గడువు పూర్తవుతుందని రాజ్ అంటాడు. నాకు గుర్తుంది రేపు ఖచ్చితంగా మీకు ఆధారాలతో నిరూపిస్తానని కావ్య అంటుంది. ఆ తర్వాత శృతి ఫోన్ చేసి కావ్యని రమ్మంటుంది. కావ్య కుడా ఇంటినుండి బయల్దేరి వెళ్తుంది. మరొకవైపు ఈ మధ్యతరగతి జీవితం నేను బతకలేను.. నేను గొప్పింటికి కోడలు కావాలని అప్పుతో స్వప్న అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.