Read more!

English | Telugu

శ్వాస ప్రాబ్లం ఉన్న రాజ్ ని హాస్పిటల్ కి తీసుకెళ్ళిన కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -141 లో.. రాజ్ కావ్య చేసిన వంటలు తినకుండా ఐస్ క్రీం తింటుంటాడు. అది చుసిన కావ్య.. నేను చేసిన వంట తినకుండా, ఇలా అడ్డమైన చెత్త తినడం ఎందుకని కావ్య అడుగుతుంది. నువ్వు చేసిన వంట తినడం కంటే ఈ చెత్త తినడమే బెస్ట్.. అందుకే తింటున్నానని రాజ్ అంటాడు. 

ఆ తర్వాత శృతి వేసిన డిజైన్ చూస్తూ, శృతిని రాజ్ మెచ్చుకుంటాడు. నన్ను కాకుండా నాలో ఉన్న కళని గుర్తించాడని కావ్య హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొక వైపు స్టేషన్ ముందే ఉన్న కనకం, కృష్ణమూర్తి ఇద్దరు బాధపడడం చూసిన అప్పు.. కానిస్టేబుల్ ని పిలిచి మా నాన్నని లోపలికి ఒకసారి పిలువండని చెప్తుంది. కానిస్టేబుల్ వెళ్లి కృష్ణమూర్తిని లోపలికి పిలుస్తుంది. మరొక వైపు ఇంట్లో ఇద్దరమే ఉన్నాము.. ఏ మాత్రం తొందరపడ్డా ముగ్గురం అవుతాం, అలా జరగకుండా ఉండాలంటే కావ్యని గదిలోకి రానివ్వకూడదు.. హాల్లో పడుకోమని చెప్పాలని రాజ్ అనుకుంటాడు. కావ్య లోపలికి రాకుండా డోర్ కి అడ్డంగా నిలబడతాడు. అప్పుడే కావ్య వస్తుంది.

నువ్వు వెళ్లి హాల్లో పడుకోమని రాజ్ అనగానే.. నా భర్త గదిలోకి నేను వెళ్తున్న అని రాజ్ ని పక్కకి నెట్టి కావ్య లోపలికి వెళ్తుంది. మరొక వైపు స్టేషన్ లోపలికి కృష్ణమూర్తి వెళ్తాడు. నాన్న మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారు. ఇంటికి వెళ్ళండని అప్పు అంటుంది. నిన్ను ఈ పరిస్థితిలో వదిలిపెట్టి మేమెలా ఎలా వెళతాం. నిన్ను బయటకు తీసుకురావడం నా బాధ్యత అని కృష్ణమూర్తి అంటాడు. నా మీద మీకు చాలా కోపం ఉంది కదా నాన్న అని అప్పు అంటుంది. లేదమ్మా చెప్పాలంటే గర్వంగా ఉంది. నీ తోబుట్టువులను ఎవరు ఒక్క మాట అన్నా నువ్వు ఊరుకోవు.. అదే రక్తసంబంధం అంటే అని కృష్ణమూర్తి అంటాడు. కాకపోతే కొంచెం అలోచించి ఉండాల్సిందని కృష్ణమూర్తి అంటాడు.

మరొక వైపు రాజ్ నిద్రపోతుంటాడు. ఒక్కసారిగా నిద్రలో ఆస్తమా ఎక్కువై శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. కావ్యపై పిల్లో వేసి తనని నిద్రలేపుతాడు. కావ్య లేచి రాజ్ కి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడం చూస్తుంది. కావ్య టెన్షన్ పడుతుంది. డాక్టర్ కి ఫోన్ చేస్తే ఫోన్ కలవకపోవడంతో కావ్య హాస్పిటల్ కి తీసుకోని వెళ్లడం కోసం సెక్యూరిటీ ని పిలుస్తుంది. సెక్యూరిటీ కి కార్ డ్రైవ్ చెయ్యడం రాకపోవడం తో.. స్కూటీ పై రాజ్ ని‌ కావ్య హాస్పిటల్ కి తీసుకొని వెళ్తుంది. హాస్పిటల్ లో అడ్వాన్స్ డబ్బులు పే చేస్తేనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామని డాక్టర్స్ చెప్తారు. కావ్య దగ్గర డబ్బులు ఉండకపోవడంతో డాక్టర్స్ ని బ్రతిమిలాడుతుంది. అయిన డాక్టర్ పట్టించుకోడు. అప్పుడే కళ్యాణ్ కి కావ్య ఫోన్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.