Read more!

English | Telugu

గవర్నమెంట్ ప్రాజెక్టు కోసం రిషి  చేయనున్న సెమినార్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -808 లో.. జగతి, మహేంద్ర, ఫణింద్రలను కాలేజీ నుండి ఇంటికి వస్తాడు శైలేంద్ర. వాళ్ళు రావడం చూసిన దేవయాని యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది. మీరు ఇంట్లో నుండి ఎందుకు వెళ్లిపోయారు. మీరు వెళ్లినప్పటి నుండి తినాలని అనిపించడం లేదు. నిద్రపోవాలని అనిపించడం లేదని దేవయాని అంటుంది. రాత్రి తినే బానే పడుకున్నారు కదా అత్తయ్య అని ధరణి అంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళకండి అని దేవయాని అనేసరికి నువ్వు అతి చెయ్యకు దేవయాని అని ఫణీంద్ర అంటాడు.

మరొక వైపు విశ్వనాథ్ వాళ్ళ కాలేజీకి రిషి వస్తాడు. ప్రిన్సిపల్ సర్ పిలుస్తున్నాడని రిషితో ప్యూన్ చెప్పడంతో.. ప్రిన్సిపాల్ రూమ్ కి వెళ్తాడు రిషి. మన కాలేజీకి ఒక ప్రపోజల్ వచ్చింది. కాలేజీ లో సెమినార్ కండక్ట్ చెయ్యండి అంటూ గవర్నమెంట్ ప్రపోజల్ ఇచ్చిందని రిషితో ప్రిన్సిపల్ చెప్తాడు. ఇది మంచి అవకాశమే అని రిషి అంటాడు. ఇలాంటి సెమినార్ కండక్ట్ చెయ్యడం వల్ల వేరే కాలేజీ వాళ్ళు ఇక్కడికి రావడం, వాళ్ళ కాలేజీ ఎలా ఉంటుందో తెలుసుకోవడం బాగుంటుంది. సెమినార్ కి ఒక మంచి టాపిక్ సెలెక్ట్ చెయ్యండని  ప్రిన్సిపల్ తో రిషి అంటాడు.

ప్రిన్సిపల్‌ కొన్ని టాపిక్స్ చెప్పినా రిషికి అవి నచ్చవు. పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ టాపిక్ తీసుకుంటే స్టూడెంట్స్ కి ఉపయోగపడుతుందని రిషి చెప్తాడు. బాగుంది దీనికి సంబంధించిన విషయాలన్నీ మొత్తం మీరే చూసుకోండని రిషితో ప్రిన్సిపాల్ చెప్తాడు. ఈ సెమినార్ ని సక్సెస్ చేసే బాధ్యత నాది అని రిషి అంటాడు. ఆ తర్వాత రిషి ఫోన్ లో మాట్లాడుకుంటూ వెళ్తుంటే వెనకాల కొంతమంది స్టూడెంట్స్.. రిషి సర్, వసుధార మేడం మధ్య ఏదో ఉందంటూ తప్పుగా మాట్లాడుతారు. అది విన్న రిషి వాళ్లకి బుద్ధి చెప్పడానికి వస్తుంటే.. ఆ లోపే పాండియన్ వచ్చి అలా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడవద్దు. వాళ్ళు చాలా మంచి వాళ్ళని చెప్తాడు. మా కోసం పోలీస్ స్టేషన్ కి వచ్చి మా జీవితలు నాశనం కాకుండా చూసాడని వాళ్లకి చెప్తాడు. రిషి పాండియన్ దగ్గరికి వచ్చి.. నీలో ఇలా మార్పు వచ్చినదుకు హ్యాపీగా ఉందని పాండియన్ ని రిషి హాగ్ చేసుకుంటాడు.

ఆ తర్వాత రిషి స్టూడెంట్స్ తో సెమినార్ గురించి మాట్లాడతాడు. స్టూడెంట్స్ అందరూ మీకు వాలాంటీర్ గా ఉంటామని రిషి తో చెప్పగానే, రిషి హ్యాపీగా ఫీల్ అవుతాడు. మరొక  వైపు వసుధార గాయానికి ఏంజిల్ డ్రెస్సింగ్ చేస్తుంటే రిషి వస్తాడు. రిషి కొంచెం హెల్ప్ చేయవా.. నాకు డ్రెస్సింగ్ చేయరావట్లేదని ఏంజిల్ అంటుంది. రిషి ఇబ్బందిగానే వసుధార గాయానికి డ్రెస్సింగ్ చేస్తాడు. ఆ తర్వాత రిషి గదిలోకి వెళ్లి.. ఎందుకు వసుధార పదే పదే ఎదురుపడుతున్నావని అనుకుంటాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.