English | Telugu

అంబానీ ఇంట సెలెబ్రేషన్స్ తో ఎంతో మందికి ఉపాధి


గీతా మాధురి అంటే చాలు చిరుత మూవీలో పాడిన "చమ్క చమ్క చమ్కీరే" అనే సాంగ్ గుర్తొస్తుంది. ఈమె చాలా వరకు ఐటెమ్‌ సాంగ్స్ ని తన హుస్కి వాయిస్‌తో పాడుతూ ఆ పాటకే వన్నె తెస్తుంది. అసలు ఆ పాటు గీత తప్ప మరెవరూ పడలేరు అన్నట్టుగా ఉంటుంది. ఆమె పాడే పాటలు కుర్రాళ్లని ఉర్రూతలూగిస్తాయి. ఆడియెన్స్ ని అలరిస్తాయి. తనదైన ప్రత్యేకమైన వాయిస్‌తో కట్టిపడేస్తుంది ఈ స్టార్‌ సింగర్‌. అలాంటి గీత ఇప్పుడు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కి జడ్జ్ గా చేస్తోంది. ఇక గీత మాధురి రీసెంట్ గా ఒక పోస్ట్ ని ఇన్స్టాగ్రామ్ పేజీలో పెట్టింది. "అంబానీ ఇంట్లో జరుగుతున్న వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ ని మెచ్చుకోవాలసిందే.

ఎందుకంటే ఈ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తుంది" అని పెట్టింది. ఇక నెటిజన్స్ ఐతే చాలామంది అదేం పూర్తి ఎంప్లాయిమెంట్ కాదు వన్ వీక్ వర్క్ మాత్రమే అంటూ మెసేజెస్ పెడుతున్నారు. అలాగే జియో చార్జెస్ హైక్ అయ్యాయి అక్కా అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. గీత ఎన్నో సూపర్‌ హిట్‌ సాంగ్స్ పాడింది. తన 16ఏళ్ల కెరీర్‌లో సుమారు 2 వేల వరకు పాటలు పాడింది గీతా మాధురి. నంది అవార్డులతో పాటు సైమా అవార్డులు, ఫిల్మ్ ఫేర్‌ పురస్కారాలను సొంతం చేసుకుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.