English | Telugu

సీత కష్టాలు సీతవి.. దీప కష్టాలు దీపవి!

తెలుగు టీవీ సీరియల్స్ కి మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండే క్రేజే వేరు. అందులోను స్టార్ మ టీవీలో ప్రసారమవుతున్న సీరియల్స్ కి డిమాండ్ కొంచెం ఎక్కువే ఉంది. వాటిల్లో బాగా పాపులర్ అయిన సీరియల్ ' కార్తీకదీపం-2 '. నవ వసంతంగా వచ్చిన ఈ సీరియల్ కి మళ్ళీ ఫ్యాన్ బేస్ పెరిగింది.

తండ్రి మాట కోసం అడవిలోకి రాముడు వెళ్ళగా తనతో పాటు సీత వెళ్ళింది.. తను పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఇది రామాయణం.. కార్తీకదీపం-2 లో దీప పడుతున్న కష్టాలు అంతే రేంజ్ లో ఉన్నాయి. ఇది ఇంటింటి రామాయణం. దీపని పెంచుకున్న తండ్రి చనిపోగా.. అత్త అనసూయ పెట్టే టార్చర్ భరించలేక.. తన భర్త నరసింహాని వెతుక్కుంటూ వచ్చిన దీపకి చేదు అనుభవం ఎదురైంది. అప్పటికే నరసింహా మరో పెళ్ళి చేసుకోవడంతో దీపకి ఏం చేయాలో తోచక , ఎటు వెళ్ళాలో తెలియక ఉంటే.. అప్పుడే సుమిత్ర మీద ఎవరో ఎటాక్ చేయడానికి వస్తే తన ప్రాణాలని కాపాడుతుంది దీప. దాంతో వారింటికి తీసుకెళ్తుంది సుమిత్ర. ‌ఇక అక్కడ వారు తమని ఏ ఇబ్బంది లేకుంటా చూసుకుంటారు.

తాజా ఎపిసోడ్ లలో దీప, తన అత్తమ్మ అనసూయ ఇద్దరు నరసింహా వాళ్ళింటికి వెళ్తారు. ఇక కొడుకు నరసింహాని కొడుతుంది అనసూయ. ఇక నరసింహా చేసుకున్న అమ్మాయిని అనసూయ తిడుతుంటే తను ఎదురుతిరుగుతుంది. నరసింహా నా వెనక తిరిగి, నన్ను పెళ్ళి చేసుకున్నాడు. పైగా ఎవరు లేరని , అందరు చనిపోయారని చెప్పాడంటు ఆవిడ అనగానే.. నరసింహాని తిడుతుంది అనసూయ. తను ఉండే ఇల్లు సొంతమని, బంగారు నగలు , పది లక్షల కారు వాళ్ళ నాన్న ఇచ్చాడంటూ నరసింహా భార్య చెప్పగానే .. డబ్బు, నగల మీద వ్యామోహంతో అనసూయ కరిగిపోతుంది. ‌ఇక దీప బ్రతుకు నడిసంద్రాన మునిగినట్టేనా అనే అంశంతో గత శనివారం ఎపిసోడ్ ముగిసింది. మరి ముందుముందు తన జీవితం ఏ మలుపు తిరగనుందో? తను కష్టాల గురించి మరింత ఉత్కంఠ నెలకొంది. మరి దీప కష్టాలు ఎప్పుడు ముగింపుకి వస్తాయో తెలియాలంటే ఈ సీరియల్ చూడాల్సిందే.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.

Karthika Deepam2 : దాస్ ని నిజం చెప్పకుండా ఆపిన కార్తీక్.. దీప ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -566 లో.. జ్యోత్స్న గురించి శివన్నారాయణకి దాస్ నిజం చెప్పాలని అనుకుంటాడు. జ్యోత్స్న, పారిజాతం టెన్షన్ పడుతారు. దాస్ ని జ్యోత్స్న  కొట్టిన విషయం చెప్తాడు కావచ్చని దశరథ్ అనుకుంటాడు. జ్యోత్స్న గురించి ఇప్పుడే నిజం తెలియొద్దని దాస్ ని ఆపాలని కార్తీక్ ట్రై చేస్తాడు.. దాస్ నిజం చెప్పబోతుంటే ఒకవైపు దశరథ్.. ఒకవైపు కార్తీక్.. ఒకేసారి దాస్ ని ఆగమంటారు. దాస్ ఏదో ..చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావ్ పక్కకిరా.. నాతో చెప్పమని దశరథ్ అంటాడు.