English | Telugu

Karthika Deepam2 : పెళ్ళికి వస్తానన్న శ్రీధర్.. తప్పులన్ని ఒప్పుకున్న పారిజాతం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -440 లో..... శ్రీధర్ దగ్గరికి కార్తీక్ వెళ్తాడు. కాసేపు నువ్వు ఎవరో నేను ఎవరో అనుకుని మాట్లాడుకుందామని కార్తీక్ అంటాడు. సరే అనీ శ్రీధర్ అంటాడు. నా పేరు కార్తీక్.. మాది హ్యాపీ ఫ్యామిలీ ఎప్పుడు సంతోషం గా ఉండే మా అమ్మ.. మా అమ్మని చిన్న పిల్లలా చూసుకునే నాన్న అని కార్తీక్ తన స్టోరీ చెప్తాడు. మా నాన్న సిగరెట్ కాలుస్తాడు. ఆ విషయం నాకు మాత్రమే తెలుసు. మా నాన్నతో నేనొక ఫ్రెండ్ లాగా ఉండేవాడిని అని కార్తీక్ చెప్తుంటే శ్రీధర్ సైలెంట్ గా వింటాడు.

మా నాన్న అంటే మాకు ఎంత నమ్మకం ఉండేది కానీ మా నాన్న ఎవరికి తెలియకుండా పెళ్లిచేసుకున్నాడు మమ్మల్ని మోసం చేసాడు. ఆ బాధ మాకు ఎలా ఉంటుంది. పిల్లలు బాధపడితే తండ్రికి చెప్పుకుంటాడు.. తండ్రి బాధపెడితే ఆ పిల్లలు ఎవరికి చెప్పుకుంటారు. ఇప్పుడు నా పెళ్లి.. అందరు కలిసి పోయే టైమ్.. ఇప్పుడు ఆ పెళ్లికి మా నాన్న రావడం అవసరం.. మా అమ్మ గౌరవం కాపాడడం అవసరం అని కార్తీక్ ఎమోషనల్ గా మాట్లాడుతాడు. దాంతో శ్రీధర్ ఎమోషనల్ అయి వస్తాను.. మీ అమ్మ గౌరవం కాపాడతానని శ్రీధర్ అనగానే కార్తీక్ హ్యాపీగా ఫీల్ అవుతూ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పారిజాతానికి జ్యోత్స్న ఫోన్ చేసి నా గదికి రా మాట్లాడాలి అంటుంది. ఇప్పుడు బయటకు రాలేను.. ఆ కార్తీక్ గాడు నాతో ఛాలెంజ్ చేసాడు. రేపు ప్రొద్దున మీ తాతతో గెంటిస్తానని కార్తీక్ చెప్పాడంటూ పారిజాతం చెప్తుంది.

ఎందుకు బావతో ఛాలెంజ్ చేసావని పారిజాతంపై జ్యోత్స్న కోప్పడుతుంది. ఆ తర్వాత పారిజాతం రాత్రంతా నిద్రపోకుండా ఉంటుంది. మరుసటి రోజు కార్తీక్, దీప రాగానే గుమ్మం దగ్గరే పారిజాతం నిల్చొని ఏమో ఛాలెంజ్ చేసావ్.. ఇంకా పది నిమిషలు టైమ్ ఉంది అంతే.. నువ్వు నాతో పెట్టుకోలేవ్ రా నా గురించి నీకు పూర్తిగా తెలియదు. అసలు జ్యోత్స్నకి శ్రీధర్ ని పెళ్లికి పిలవమని చెప్పమనే ఐడియా ఇచ్చింది నేనే అంటూ పారిజాతం తను చేసిన తప్పులన్నీ చెప్పేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.