English | Telugu

Karthika Deepam2 : పెళ్ళికి రానని చెప్పిన శ్రీధర్.. దీపని తిట్టేసిన సుమిత్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -437 లో.....శ్రీధర్ పేపర్ లో రాశి ఫలాలు చదువుతుంటాడు. అనుకోని అతిధి ఆగమానం తలకి మించిన భారంగా ఉంటుందని అందులో ఉంటుంది. అదేంటి ఇలా ఉంది అనుకొనే లోపే కార్తీక్, కాంచన ఎంట్రీ ఇస్తారు. రాశిఫలాలు రాసేటోడు ఎవరో గానీ జీవితాల్లోకి తొంగి చూసి మరి రాస్తున్నాడని శ్రీధర్ అంటాడు.

అప్పుడే కావేరి వచ్చి.. అక్క లోపలికి రండి అని పిలుస్తుంది. నా కోసం కాదు.. వీళ్ళు నీ కోసం వచ్చి ఉంటారేమోనని శ్రీధర్ అనగానే లేదు మీ కోసం వచ్చామని కాంచన అంటుంది. ఏంటి దీప తాళిని జ్యోత్స్న తెంపిందట వాళ్ళందరు వచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగారట అని శ్రీధర్ అంటాడు. దీపకి తల్లితండ్రుల స్థానంలో మా అన్నయ్య, వదిన పెళ్లి చేస్తున్నారు. కార్తీక్ కి తండ్రిగా మీరు తల్లిగా నేను ఉండాలని కాంచన అంటుంది. నేను రానని శ్రీధర్ మొహం మీదే చెప్తాడు. కాసేపటికి దీప గురించి శ్రీధర్ తప్పుగా మాట్లాడతాడు. వస్తాను కానీ పెళ్లి కూతురుగా దీప ఉంటే కాదని శ్రీధర్ చెప్తాడు. కార్తీక్ కి కోపం వస్తుంది కానీ కాంచన ఆపుతుంది. శ్రీధర్ రానని చెప్పి లోపలికి వెళ్తాడు. కార్తీక్, కాంచన ఇంటికి వెళ్తారు.

వాళ్ళు వచ్చి పిలిచినందుకు అయిన ఈయన వెళ్లొచ్చు కదా అని కావేరి అంటుంది. మరొకవైపు సుమిత్ర దగ్గరికి దశరథ్ వచ్చి గుడికి వెళదామని అంటాడు. రానని సుమిత్ర అంటుంది. దాంతో దశరథ్ ఒక్కడే వెళ్తాడు. ఆ తర్వాత సుమిత్ర దగ్గరికి దీప వస్తుంది. ఏం వంట చేయాలని దీప అడుగగా.. రోజు నన్ను అడిగే చేస్తున్నావా అని సుమిత్ర కోప్పడుతుంది. అసలు కార్తీక్ తో అలా మాట్లాడిస్తుంది నువ్వే.. వెనకాల ఉండి నడిపిస్తున్నావ్.. ఎందుకంటే నేనంటే నీకు కోపం.. నీ పెళ్లి చెయ్యడం దౌర్భాగ్యం.. నిన్ను కూతురు అనుకోవడం నేను చేసిన పాపమని సుమిత్ర అంటుంటే.. దీప బాధపడుతుంది. అదంతా పారిజాతం, జ్యోత్స్న చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.