English | Telugu

Karthika Deepam2 : దాస్ కి వార్నింగ్ ఇచ్చిన జ్యోత్స్న..ఆలోచనలో పడ్డ కార్తీక్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -358 లో... దీప దగ్గరికి కార్తీక్ వచ్చి మాట్లాడతాడు. లాకెట్ ని కార్తీక్ చూసి ఇది చిన్నప్పుడు మీ అమ్మ ఇచ్చింది కదా మీ అమ్మ పేరేంటి అసలు నీ పుట్టుక గురించి చెప్పమని దీపని కార్తీక్ అడుగుతాడు. అదేంటి అలా అడుగుతున్నారు మా అమ్మని నేను చూడలేదని దీప అంటుంది. ఒకవేళ మీ అమ్మనాన్న బ్రతికే ఉన్నారేమో.. అందుకే ఆ రోజు పిండేం ముట్టలేదేమోనని కార్తీక్ అంటాడు. ఆ విషయం మీకెలా తెలుసని దీప అనగానే సుమిత్ర అత్త చెప్పింది. నువ్వు చెప్పావట కదా అని కార్తీక్ అంటాడు. నా గురించి బానే తెలుసుకున్నారని దీప అంటుంది.

అదంతా అనసూయ వింటుంది. కార్తీక్ బాబుకి దీప గురించి ఏదైనా నిజం తెలిసి ఉంటుంది.‌ అందుకే ఇలా అంటున్నారు ఇంకా కార్తీక్ బాబు అడిగితే దీప బాధపడుతుందని వాళ్ళు మాట్లాడుకుంటుంటే అనసూయ వెళ్లి కాఫీ ఇస్తుంది. మరొకవైపు పారిజాతం తీసిన వీడియోని జ్యోత్స్నకి చూపిస్తుంది. వెంటనే ఇప్పుడు మనం దాస్ దగ్గరికి వెళ్లాలని జ్యోత్స్న అంటుంది. ఇద్దరు దాస్ దగ్గరికి వస్తారు. అక్కడ స్వప్న, పారిజాతం గొడవపడతారు.

ఆ తర్వాత పారిజాతం, జ్యోత్స్నలని తన గదిలోకి తీసుకొని వెళ్తాడు దాస్. గ్రానీ నువ్వు కాఫీ తీసుకొని రా అని జ్యోత్స్న పారిజాతాన్ని పంపిస్తుంది. దాస్ గతం గుర్తులేనట్లే నటిస్తాడు. నీకు గతం గుర్తు ఉందని తెలుసు నాన్న.. నా గురించి నువ్వు ఎవరికైనా చెప్పే ప్రయత్నం చేస్తే ఊరుకోనంటూ వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. కానీ దాస్ పట్టించుకోనట్లు ఉంటాడు. ఆ తర్వాత కార్తీక్ దగ్గరికి దాస్ వెళ్లి జ్యోత్స్న వార్నింగ్ ఇచ్చిన విషయం చెప్తాడు. అసలు జ్యోత్స్న అగ్రిమెంట్ లో ఏం రాసి ఉంటుంది. దీపతో విడిపోవాలని రాసిందా అని దాస్ అనగానే కార్తీక్ ఆలోచనలో పడతాడు. అప్పుడే వాళ్ళని దీప చూస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.