English | Telugu

Karthika Deepam2 : పారిజాతం తీసుకొచ్చిన ఫోన్ రికార్డ్ చూసి జ్యోత్స్న షాక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -357 లో.... దీప ఇంటి దగ్గర సిచువేషన్ ఎలా ఉందో కనుక్కోమని పారిజాతాన్ని పంపిస్తుంది జ్యోత్స్న. పారిజాతం చెత్త వేరుకునే గెటప్ లో దీప ఇంటికి వస్తుంది. తనని చూసి ఏంటి ఏం కావాలని అనసూయ అడుగుతుంది. హమ్మయ్య గుర్తు పట్టలేదని పారిజాతం అనుకుంటుంది. నీ వాయిస్ ఎక్కడో విన్నానని అనసూయ అనగానే ఎవరి వాయిస్ అమ్మ అని పారిజాతం అడుగుతుంది . ఒకావిడ అంటు పారిజాతాన్ని అనసూయ తిడుతుంది.

అప్పుడే దాస్, కాశీ, స్వప్న ఇంటికి వస్తారు. పారిజాతం వాళ్ళని చూసి టెన్షన్ పడుతుంది. వాళ్ళు లోపలికి వెళ్లి దీపని పరామర్శిస్తారు. అసలు ఇంటికి వచ్చి పొడిచే అంత దైర్యం ఉందంటే వాడిని వదులొద్దని దాస్ అంటాడు. దాస్ గతం గుర్తుకు వచ్చినట్లు మాట్లాడుతుంటే అన్నయ్య మిమ్మల్ని కొట్టింది ఎవరు అని కాంచన వాళ్ళు అడుగుతారు. ఎవరంటే అని దాస్ చెప్పబోతుంటే కార్తీక్ తన భుజంపై చెయ్ వేసి ఆపుతాడు. మళ్ళీ గతం మర్చిపోయినట్లు యాక్టింగ్ చేస్తాడు. అదంతా పారిజాతం ఫోన్ లో రికార్డు చేస్తుంది. ఆ తర్వాత దాస్ ని కార్తీక్ బయటకు తీసుకొని వచ్చి.. మావయ్య మీరు ఇప్పుడే నిజం చెప్పకండి కొన్ని రోజులు ఇలా యాక్టింగ్ చెయ్యండి అని చెపుతాడు. అప్పుడే కాశీ వస్తాడు. విన్నాడేమోనని ఇద్దరు అనుకుంటారు కానీ కాశీ వాళ్ళ మాటలు వినలేదు.

ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వెళ్లి.. ఫోన్ లో రికార్డు చేసిన ఆ రికార్డు చూపిస్తుంది. అదంతా చూసి షాక్ అవుతుంది. అంటే దాస్ కి గతం గుర్తుకి వచ్చినట్లుంది బావకి ఏదైనా నిజం తెలిసినట్లుంది. అందుకే ఆ రోజు అలా మాట్లాడాడు అని జ్యోత్స్న అనుకుంటుంది. రేపు దాస్ ని మనమిద్దరం కలవాలని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. మరొకవైపు దీపకి టాబ్లెట్ ఇచ్చి కార్తీక్ మాట్లాడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

ఆ మీమ్ నన్ను చాలా డిస్టర్బ్ చేసింది...సావండి అంటున్న నైనికా అనసుర

నైనికా అనసురు బుల్లితెర మీద అందరికీ పరిచయమే. బిగ్ బాస్ సీజన్ 8 ద్వారా బాగా ఫేమస్ అయ్యింది. అలాగే ఢీ డాన్స్ షోలో డాన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ఇక ఇప్పుడు బిబి జోడి సీజన్ 2 లో అమరదీప్ కి జోడిగా చేస్తోంది. అలాంటి నైనికా రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో ఘాటుగా ఒక పోస్ట్ పెట్టింది. "ఎలాంటి పని లేకుండా జస్ట్ కూర్చుని అమ్మాయిల చిత్రాలను ఘోరంగా ఎడిట్ చేస్తూ వాళ్ళను హరాస్ చేసే ఒక స్టుపిడ్ మీమ్ పేజీలో పోస్ట్ చేసిన నా చిత్రాలు నన్ను చాలా డిస్టర్బ్ చేశాయి. మీకు పని లేదు బ్రో, మాకు మిమ్మల్ని పట్టించుకునేంత టైం లేదు. నువ్వు మా మీద పోస్ట్లు పెడుతున్నావ్ అంటే నువ్వు నీలోనే తోపు ఐనట్టే..మీ పేరెంట్స్ నిన్ను బాగా పెంచారు. మీలాంటి వాళ్ళే రేపు రేపిస్టుల్లా తయారవుతారు.