English | Telugu
Karthika Deepam2 : కార్తిక్ కి దూరంగా వెళ్తున్న దీప.. వెళ్ళిపోమన్నారా అమ్మ!
Updated : Jul 9, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -91 లో... శౌర్యని డిశ్చార్జ్ చేసుకొని కడియం దగ్గరికి వస్తుంది దీప. నేను ఎక్కడ ఉన్నాను.. ఏంటి అని ఎవరికీ తెలియకుండా ఉండాలనుకుంటున్నాను.. నువ్వు ఎవరికీ చెప్పకూడదని దీప అనగానే.. నా జీవితం బాగు చేసి ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నావ్ ఏంటమ్మ అని కడియం అంటాడు. నా చిట్కాలు మొత్తం తెలుసుకున్నావ్ .. ఇప్పుడు హోటల్ కి కస్టమర్స్ బాగా వస్తున్నారు.. ఇంకేంటి ఇక నా అవసరం హోటల్ కి లేదు బాబాయ్ అని దీప అంటుంది.
నాకు పని ఇచ్చి హెల్ప్ చేసావ్.. ఇంకొక హెల్ప్ చెయ్యాలి ఇక్కడ ఏదైనా ఇల్లు అద్దెకి చూడమని దీప అనగానే.. ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళ ఇల్లు ఉందని దీప, శౌర్యలని తీసుకొని కడియం ఆ ఇంటికి వెళ్తాడు. అప్పుడే కడియంకి కార్తీక్ ఫోన్ చేస్తాడు. దీప తన దగ్గరికి వచ్చినట్టు కార్తీక్ కి చెప్పొద్దని దీప అంటుంది. దాంతో కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు కడియం. దీప అక్కడకి ఏమైనా వచ్చిందా అని కార్తిక్ అడుగగా.. లేదు రాలేదని కడియం అంటాడు. ఒకవేళ వస్తే నాకు ఫోన్ చెయ్యండని కార్తీక్ చెప్పగానే కడియం సరేనంటాడు. మరొకవైపు జ్యోత్స్న డల్ గా ఉండడంతో.. ఏమైందని పారిజాతం అడుగుతుంది. ఏం లేదని జ్యోత్స్న అనగానే.. ఏం లేకపోతే ఎందుకు దిగులుగా ఉన్నావని పారిజాతం అంటుంది. దాంతో జ్యోత్స్న జరిగింది మొత్తం పారిజాతానికి చెప్తుంది. కార్తీక్ అన్న మాటలకి పారిజాతం షాక్ అవుతుంది. ఇక దీప వెళ్ళిపోయింది హ్యాపీగా ఉండొచ్చని జ్యోత్స్న అంటుంది. ఎందుకు ఇలా తెలివి తక్కువగా ఆలోచిస్తావ్.. శౌర్యని కూతురు అన్నవాడు.. దీపని భార్య అని చెప్పలేడా.. శత్రువుని పక్కన పెట్టుకోవాలి.. మిత్రడుని ఎదరుగా పెట్టుకోవాలి.. ఆ దీపని పక్కన పెట్టుకుంటే తన ప్రతి పని, ప్రతీ ఆలోచన మనకి తెలుస్తుంది.
ఇప్పుడు దీప ఎక్కడున్నా వెతికి ఇంటికి తీసుకొని రావాలని పారిజాతం చెప్తుంది. మరొకవైపు కార్తీక్ అన్న మాటలు గుర్తుకు చేసుకుంటుంది దీప. కార్తీక్ కి మనం ఇక్కడున్నామని చెప్పాలి.. మనం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నుండి ఎందుకు వచ్చాం.. వాళ్లు వెళ్లిపొమ్మన్నారా అని దీపతో శౌర్య అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.